in

ప్రమోషనల్ కంటెంట్ పంపాలంటే యూజర్ అనుమతి కావాలి

ప్రమోషనల్ కంటెంట్ పంపాలంటే యూజర్ అనుమతి కావాలి

మనకి ప్రతి రోజు సొంత వాళ్లు, తెలిసిన వాళ్లు చేసే కాల్స్ కన్నా ప్రమోషన్స్ గురించి వచ్చే ప్రమోషనల్ సందేశాలు, స్పామ్ మెసేజ్ లే ఎక్కువ. లోన్స్ ఇస్తామనో.. ప్రోడక్ట్స్ పై డిస్కౌంట్స్ ఉన్నాయనో అంటూ రకరకాల మెసేజ్స్ వస్తుంటాయి.

దీనివల్ల కొన్ని సార్లు ఇబ్బంది కూడా కలుగుతుంది. దీంతో ప్రమోషనల్ సందేశాలను అరికట్టడానికి డిజిటల్ గా అనుమతి పొందేందుకు ట్రాయ్ డీసీఏ పేరిట ఓ ప్రోగ్రామ్ ను ఇటీవల తీసుకొచ్చింది. ఈ ప్రోగ్రామ్ ప్రకారం లోన్లు, స్కీములు అంటూ బ్యాంకులు, రియల్ ఎస్టేట్ సంస్థలు పంపే ప్రమోషనల్ సందేశాలను ఇకపై పంపించాలంటే ముందుగా యూజర్ అనుమతి తీసుకోవాలి. ఒకవేళ ఏదైనా ఏజెన్సీ యూజర్ కు కంటెంట్ పంపించాలీ అంటే.. ముందుగా టెలికాం ఆపరేటర్ నుంచి అనుమతి పొందాలి. అనంతరం సదరు టెలికాం ఆపరేటర్ 127*** కోడ్ తో కూడిన ఓ ఎస్సెమ్మెస్ (sms) పంపుతుంది. ఆ సందేశంలో దేనికోసం అనుమతి కోరుతున్నదీ అనేది అందులో క్లియర్ గా ఉంటుంది.

దానికి యూజర్ అనుమతి ఇవ్వాలి అనుకుంటే ఇవ్వొచ్చు. ఇష్టం లేకపోతే నిరాకరించనూ వచ్చు. అయితే ఒకవేళ యూజర్ అనుమతికి నిరాకరిస్తే.. టెలికాం కంపెనీ సదరు ఏజెన్సీని ఆ యూజర్ కు ఇకపై సందేశాలు పంపకుండా నిలువరిస్తుంది. ఒక వేళ యూజర్ అనుమతి ఇచ్చినా ఆ తరువాత ఇబ్బందిగా అనిపించినప్పుడు ప్రమోషనల్ సందేశాలకు ఇచ్చిన అనుమతులను సులువుగా ఉపసంహరించుకోవచ్చు. అయితే అలా ఉపసంహరించుకోవాలి అనుకునే వాళ్లు ఓ ఆన్లైన్ పోర్టల్ ను సంప్రదించాల్సి ఉంటుంది. అలాంటి ఆన్లైన్ పోర్టల్ ను సిద్దం చేయాలని ట్రాయ్ టెలికాం కంపెనీలకు సూచించింది.

What do you think?

“దీపావళి ఆ రోజునే జరుపుకోవాలి” – వేద పండితులు

తనకు రూ.58.7కోట్ల ఆస్తి ఉన్నట్లు పేర్కొన్న కేసీఆర్