in ,

మిస్టరీగా మిగిలిపోయిన జోడియాక్ కిల్లర్. ఆ లెటర్స్ వెనుక ఉన్న మొహం ఎవరిది?

మిస్టరీగా మిగిలిపోయిన జోడియాక్ కిల్లర్. ఆ లెటర్స్ వెనుక ఉన్న మొహం ఎవరిది?

చేసిన హత్యలు ఎవరికీ తెలియకుండా ఉండడం కోసం హంతకులు ఏమైనా చేస్తారు. ఎవిడెన్స్ (evidence ) లేకుండా జాగ్రత్త పడుతుంటారు. బాడీలను హత్య జరిగిన స్థలం నుండి దూరంగా పడేస్తుంటారు. ఇలా పోలీసులకు దొరకకకుండా ఉండడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తుంటారు. కానీ జోడియాక్ (zodiac) అనే కిల్లర్ డైరెక్ట్ గా పోలీసులకు ఫోన్ చేసి మరీ తను చేసిన హత్యలు ఒప్పుకున్నాడు. కానీ ఎన్నో ఏళ్లు ఇన్వెస్టిగేటివ్ (investigate) చేసిన తరువాత కూడా అతన్ని పట్టుకోలేకపోయారు. చివరికి అసలు హంతకుడు ఎవరు అనేది ఒక మిస్టరీ గానే మిగిలిపోయింది.

1968 నుంచి 1969 వరకు ఒక ఏడాది పాటు ఈ జోడియాక్ కిల్లర్ వరుస హత్యలతో, ఆ హత్యలు తనే చేశానని చెప్పుకునే లెటర్స్ తో కాలిఫోర్నియాలోని సాన్ ఫ్రాన్సిస్కో (san francisco) ను గడగడలాడించాడు. పోలీసులకి, ప్రజలకు తెలిసి అతను చేసింది 5 హత్యలు మాత్రమే. కానీ ఆ తరువాత అతను లెటర్ల ద్వారా చెప్పింది మాత్రం 37 హత్యలు చేశానని.

అసలు ఈ కిల్లర్ చేసిన హత్యలు మొదటి సారి వెలుగులోకి వచ్చింది డిసెంబరు 20, 1968లో. 16 ఏళ్ల బెట్టీ లౌ జెన్సన్, 17 ఏళ్ల డేవిడ్ ఆర్థర్ ఫెరడే అనే ఇద్దరు హై స్కూల్ స్టూడెంట్స్ ను లేక్ హర్మెన్ రోడ్డులో జోడియాక్ కిల్లర్ గన్ తో కాల్చి చంపేశాడు. అలా మొదటి సారి వెలుగులోకి వచ్చాడు. ఆ తరువాత సరిగ్గా ఆరు నెలల తరువాత మొదటి హత్య జరిగిన ప్రదేశానికి 6 కిలో మీటర్ల దూరంలో మరో ఇద్దర్ని ఇలాగే షూట్ చేశాడు. కానీ అదృష్టవశాత్తు ఆ ఇద్దరిలో మైఖేల్ మాగో అనే వ్యక్తి ప్రాణాలతో బయట పడ్డాడు. అతనే తరువాత పోలీసులకు జోడియాక్ కిల్లర్ రూపు రేకలు చెప్పాడు. జోడియాక్ కిల్లర్ తెల్లగా 5’8 అడుగులు ఉంటాడని మైఖేల్ మాగో చెప్పాడు. అయితే అప్పుడే ఎవరూ ఊహించని ట్విస్ట్ జరిగింది.

రెండో హత్య జరిగిన సమయంలో రాత్రి 12:45 కి జోడియాక్ కిల్లర్ తనంతట తనే పోలీసులకు ఫోన్ చేసి ఆ హత్య, అంతకు ముందు జరిగిన హత్య రెండూ చేసింది తనే అని చెప్పాడు.

ఇలాగే లోకల్ న్యూస్ పేపర్ కీ ఒక లెటర్ పంపాడు. ఆ లెటర్ పేపర్ ఫ్రంట్ పేజ్ లో రావాలని, లేకపోతే సిటీలో వరుస హత్యలు జరుగుతాయని జోడియాక్ బెదిరించాడు. తను పంపే లెటర్స్ ఒక సీక్రెట్ కోడ్ లాంగ్వేజ్ తో ఉండేవి. వాటిలో ఒక లెటర్ ను ఒక స్కూల్ టీచర్ తన భార్యతో కలిసి డీకోడ్ చేశారు.

ఆ లెటర్ లో ” నాకు జంతువులను చంపడం ఇష్టం. దానికన్నా మనుషులను చంపడం ఇంకా ఇష్టం. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనిషే అన్నిటికన్నా వైల్డ్ యానిమల్ కద. నేను చనిపోయిన తరువాత స్వర్గానికి వెళ్తాను. అక్కడ నేను చంపిన ప్రతి ఒక్కరు నాకు బానిసలు అవుతారు. నేను మీకు నా పేరు చెప్పను. పోలీసులకు భయపడి కాదు, నాకు నా బానిసలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి ” అని ఉంది.

ఆ తరువాత కూడా ఇలాగే సీక్రెట్ కోడ్స్ తో చాలా లెటర్స్ వచ్చాయి. చాలా అనోనిమస్ (anonymus) కాల్స్ వచ్చాయి. కానీ పోలీసులకు అసలైన జోడియాక్ కిల్లర్ ని పట్టుకునే ఒక్క సరైన ఆధారం కూడా దొరకలేదు. ఇక ఆ కిల్లర్ ఎవరనేది ఒక మిస్టరీ గానే మిగిలిపోయింది.

అయితే ఈ కిల్లర్ కద మిస్టరీగానే మిగిలినా హాలీవుడ్ లో దర్శకుడు డేవిడ్ ఫించెర్ (David Fincher) కిల్లర్ పేరు మీద “జోడియాక్” (ZODIAC ) అనే సినిమాను తెరకెక్కించారు. ఆ సినిమాలో కిల్లర్ ఎవరనేది తెలిపే ప్రయత్నం చేశారు.


What do you think?

మద్యం మత్తులో బాంబు కొరికి ప్రాణాలు కోల్పోయాడు

వన్డే ర్యాంకింగ్స్ టాప్‌-10లో ముగ్గురు భారత్ బ్యాటర్లు