in ,

అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు

అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు.

దిల్లీలో 69వ నేషనల్ అవార్డు 2023 కార్యక్రమం వేదికగా అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. పుష్ప 1’’ (PUSHPA 1) సినిమాకుగాను అల్లు అర్జున్ (Allu Arjun) ను ఈ జాతీయ పురస్కారం వరించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు.

ఈ సందర్బంగా వేదికపై అల్లు అర్జున్ మాట్లాడుతూ.. తనకు నేషనల్ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. అనంతరం పుష్పలోని “తగ్గేదేలే” డైలాగ్ చెప్పి అలరించారు.

దీనికి సంబంధించిన వీడియోను మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

What do you think?

“2035 నాటికి భారత్ సొంత స్పేస్ స్టేషన్” – కేంద్రం

ఇండియాను ఓడిస్తే ఆ ఆటగాడితో డేట్ కు వెళ్తా – పాక్ నటి షిన్వారి