గ్రూప్ 4 పరీక్షలో ‘బలగం’ సినిమాపై ప్రశ్న..
జబర్దస్త్ లో కమెడియన్ గా మంచి పేరు పొందిన వేణు ఎల్దండి తెరకెక్కించిన ‘బలగం’ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద భారీ వసూళ్లను కొల్లగొట్టిన విషయం తెలిసిందే. ప్రాంతీయ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా అంతర్జాతీయ అవార్డులను అందుకుంది. ప్రేక్షకుల మనసులలో ప్రత్యేక స్థానం దక్కించుకుంది. ఇప్పుడు ఈ సినిమా మరో అరుదైన గతను సాధించింది.
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్ 4 పరీక్షలో ఈ ‘బలగం’ సినిమాపై ఓ ప్రశ్న అడిగారు. బలగం చిత్రానికి సంబంధించి కింది జతలలో ఏది సరైనదో సూచించండి అంటూ పేర్కొన్నారు. A. దర్శకుడు: వేణు యెల్దండి, B. నిర్మాత:దిల్ రాజు/ హన్షితారెడ్డి/హర్షిత్‌రెడ్డి, C. సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో, D. కొమురయ్య పాత్ర: ఆరసం మధుసూధన్. వీటిలో ఏది సరైనదో సూచించండి అని అడిగారు.
తెలంగాణ సంస్కృతి నేపథ్యంలో తెరకెక్కిన ఈ ‘బలగం’ సినిమాకి ఇలాంటి ప్రాముఖ్యత దక్కడం విశేషం. దీంతో ఇది ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.