in ,

రణ్వీర్ సింగ్ “పుష్ప – 2” కనిపించబోతున్నాడా?

రణ్వీర్ సింగ్ “పుష్ప-2” కనిపించబోతున్నాడా?

 

బాలీవుడ్ బడా స్టార్ “పుష్ప – 2” కనిపించబోతున్నాడట. ఇది నిజమేనని సినీ వర్గాలలో టాక్ కూడా నడుస్తుంది.

 

“పుష్ప – 2” షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అల్లు అర్జున్ బర్త్డే కి “వేర్ ఈస్ పుష్ప” అంటూ చిత్రబృందం ఓ టీజర్ ని విడుదల చేసి సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ఫాహద్ ఫాజీల్ కు సంబంధించిన కీలక షెడ్యూలు కూడా ఇటీవల పూర్తయింది. ఈ అప్డేట్ ను తెలియచేస్తూ చిత్ర బృందం ఓ ఫోటోను కూడా విడుదల చేసింది.

అయితే తాజాగా బాలీవుడ్ ప్రముఖ స్టార్ హీరో రణ్‌వీర్ “పుష్ప – 2” లో కనిపించబోతున్నాడని సినీ వర్గాలలో టాక్ నడుస్తుంది.

రణ్‌వీర్ ఈ మూవీలో ఓ కీలక అతిథి పాత్రలో కనిపింబోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. రణ్‌వీర్ ఆల్రెడీ ఉత్తరాది ప్రేక్షకులకు పోలీసు పాత్రలో తెలుసు. దీంతో పుష్ప-2 లో కూడా పోలీసు పాత్రలో ఈ బాలీవుడ్ స్టార్ చేయబోతున్నారని తెలుస్తోంది.
అయితే దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన ఇంకా రావల్సి ఉంది.

What do you think?

13 ఏళ్ల చిన్నారి గుండెపోటుతో కన్నుమూత!

ఎట్టకేలకు వీడిన శానంబట్ల మంటల మిస్టరీ…