in

ఎట్టకేలకు వీడిన శానంబట్ల మంటల మిస్టరీ…

ఎట్టకేలకు  వీడిన శానంబట్ల మంటల మిస్టరీ…

 

శానంబట్లలో రగులుతున్న మంటల మిస్టరీ ఇప్పటికి చల్లారింది. అక్కడ అసలు ఏం జరుగుతుందో తెలియక తలలు పట్టుకున్న పోలీసులకు ఇప్పటికి ఊరట కలిగింది. దీంతో అక్కడ ఎలాంటి ప్రమాదం లేదని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.

 

కొన్ని రోజులుగా తిరుప‌తి జిల్లా చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోని శానంబ‌ట్ల‌లోని ఇళ్ల‌లో, గ‌డ్డివాముల‌కు మంట‌లు వ్యాపించి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న సృష్టించిన విషయం తెలిసిందే. మంట‌ల‌కు వివిధ చాన‌ళ్లు అశాస్త్రీయంగా, మూఢ విశ్వాసాల‌ను పెంచిపోషించేలా ఆజ్యం పోసే క‌థ‌నాలు ప్ర‌సారం చేశాయి. పోలీసులు కూడా అక్కడ ఏం జరుగుతోందో తెలియక తలలు పట్టుకున్నారు. అయితే తాజాగా దీని మిస్టరీని పోలీసులు చేధించారు.

 

అసలు ఈ శానంబ‌ట్ల‌లో రగిలిన మంటలు మొద‌ట గ‌డ్డివాముకి ఆకతాయి మొద‌ట నిప్పు పెట్టడంతో మొదలైంది. ఇది ఎండా కాలం కావ‌డంతో మంట‌లు పెద్ద ఎత్తున చేల‌రేగి ప‌శువుల మేత బుగ్గిపాలు చేసాయి.

ఈ సమయంలో బంధువుల‌పై ప్ర‌తీకారంతో ర‌గిలిపోతున్న కీర్తి అనే మ‌హిళ ఎదురింట్లో గ‌డ్డివాముకి నిప్పు పెట్టింది. ఆ త‌ర్వాత ఎవ‌రూ గుర్తించ‌లేర‌నే ఉద్దేశంతో వ‌రుస‌గా బంధువుల ఇళ్ల‌లో అలాగే నిప్పు రాజేయడం కొన‌సాగించింది. ఈ ఘటనలో న‌ష్ట‌పోయిన బాధితుల‌కు ప్ర‌భుత్వం న‌ష్ట‌ప‌రిహారం అంద‌జేసింది.

ఇలా మంటలు రగిలితే ఆశ‌ప‌డి ప్ర‌భుత్వం న‌ష్ట‌ప‌రిహారం అందజేస్తుందని ఆశపడిన గ్రామంలోని మ‌రో ఇద్ద‌రు త‌మ ఇళ్ల‌లో నిప్పు పెట్టుకుని ఏదో జ‌రిగిపోతోంద‌న్న‌ట్టు క్రియేట్ చేశారు.
పోలీసుల విచార‌ణ‌లో వాస్త‌వాలు వెలుగులోకి రావడంతో కీర్తి అనే మ‌హిళ‌తో పాటు మ‌రో ఇద్ద‌రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అలా ఎట్టకేలకు శానంబట్లలో రగులుతున్న మంటల మిస్టరీ  చల్లారింది.

What do you think?

రణ్వీర్ సింగ్ “పుష్ప – 2” కనిపించబోతున్నాడా?

మ్యూజియంలో తన హృదయాన్ని చూసుకుని గర్వపడిన ఓ యువతి.