in

మ్యూజియంలో తన హృదయాన్ని చూసుకుని గర్వపడిన ఓ యువతి.

మ్యూజియంలో తన హృదయాన్ని చూసుకుని గర్వపడిన ఓ యువతి.

 

అమెరికాలోని ఓ యువతి మ్యూజియంలో తన గుండెను తనే వీక్షించింది. ఇది నన్ను 22 ఏళ్లు బ్రతికించిన గుండె అంటూ చెప్పుకుంది. అదెలా అంటారా.. అయితే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.

హాంప్‌షైర్‌లోని రింగ్‌వుడ్‌కు చెందిన జెనిఫర్‌ సటన్‌ అనే యువతి.. 22 ఏళ్ల వయసులో గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపింది. వైద్యులు కూడా ఆమెకి హార్ట్ మార్పు చేయాలని, లేదంటే ప్రాణాలకే ప్రమాదమని తెలిపారు.

దీంతో ఆమెకు సరిపోయే గుండె కోసం అన్వేషిస్తుండగా.. ఆరోగ్యం క్షీణించసాగింది. ఇక గుండె దొరకదని ఆసలు వదిలేసుకుంటున్న సమయంలో ఎట్టకేలకు 2007 జూన్‌లో ఓ దాత దొరికారు.
అయితే ఈమెకు 13 ఏళ్ల వయసున్నప్పుడు ఆమె తల్లి సైతం ఇలాంటి శస్త్రచికిత్స అనంతరం మృతి చెందారు. దీంతో ఆమె తొలుత ఆందోళన చెందింది. అదృష్టవశాత్తు అనుకున్నట్టుగానే డాక్టర్లు గుండెను విజయవంతంగా అమర్చగలిగారు. అలా మరో సారి ఆ యువతి ఊపిరి పీల్చుకుంది.
శస్త్రచికిత్స ద్వారా తొలగించిన హృదయాన్ని ప్రదర్శనలో ఉంచేందుకుగానూ ‘రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్’కు ఆమె అనుమతి ఇచ్చింది.

దీంతో అవయవాల నమూనాలను ప్రదర్శించే ‘హంటేరియన్ మ్యూజియం’లో ఆమె గుండెను భద్రపరిచారు. ఇప్పుడు దాన్ని పౌరులందరి సందర్శన కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే అక్కడికి వచ్చిన ఆమె తన సొంత హృదయాన్ని చూసుకుని పొంగిపోయింది. “ఇది నా స్నేహితురాలు. 22 ఏళ్ల పాటు నన్ను బతికి ఉంచింది.” అని తన పాత హృదయాన్ని చూపిస్తూ గర్వంగా చెప్పింది.

What do you think?

ఎట్టకేలకు వీడిన శానంబట్ల మంటల మిస్టరీ…

వాట్స్ యాప్లో కొత్త ఫీచర్.. ఇక నుంచి అలా చేయొచ్చు.