in

వాట్స్ యాప్లో కొత్త ఫీచర్.. ఇక నుంచి అలా చేయొచ్చు.

వాట్స్ యాప్లో కొత్త ఫీచర్.. ఇక నుంచి అలా చేయొచ్చు.

 

వాట్స్ యాప్ ఒక కొత్త ఫీచర్ ను యూజర్ల అందుబాటులోకి తీసుకురానుంది. ఈ విషయాన్ని వాట్స్ యాప్ బ్లాగ్ పోస్ట్ ద్వారా తెలిపింది.

 

విషయం ఏంటంటే తమ యూజర్లలో సగం మందికి పైగా మొబైల్ ఫోన్ పై తమ సైట్ యాక్సెస్ చేస్తున్నారని ఆ సమయంలో టైపింగ్ తప్పులు వస్తున్నాయని తెలుసుకున్న ఫేస్ బుక్ యూజర్ల కు పోస్ట్ చేసిన వాటిని మళ్లీ ఎడిట్ చేసుకునే ఫీచర్ ను దశాబ్దం క్రితమే తీసుకువచ్చింది.
ఎలోన్ మస్క్ ట్విట్టర్ ను స్వాధీనం చేసుకున్న తరువాత ట్విట్టర్ పేమెంట్ సబ్స్క్రైబర్లకు కూడా ఈ ఎడిట్ ఫీచర్ ని అందుబాటులో తీసుకువచ్చాడు.

ఇప్పుడు వీటిని ఫాలో అవుతూ వాట్స్ యాప్ కూడా అప్లోడ్ చేసిన పోస్టులను ఎడిట్ చేసుకునే ఫీచర్ ను యూజర్ల కు త్వరలో అందించబోతోంది.

ఈ విషయాన్ని బ్లాగ్ పోస్ట్ ద్వారా వాట్స్ యాప్ తెలిపింది. “ఎడిటింగ్ ఫీచర్ వల్ల చిన్న చిన్న తప్పులను సరిచేసుకోవడం నుంచి మెసేజ్కు అదనపు వివరాలను యాడ్ చేసుకునేంత వరకు, మీ చాట్లపై మీకు మరింత నియంత్రణ ఉంటుంది” అంటూ బ్లాక్ పోస్ట్ లో పోస్ట్ చేసింది.

What do you think?

మ్యూజియంలో తన హృదయాన్ని చూసుకుని గర్వపడిన ఓ యువతి.

మే 25న తెలంగాణ ఎంసెట్ ఫలితాల విడుదల.