in

కుక్కకాటుకు గురైతే ఒక్కో పంటి గాటుకు రూ.10 వేలు

కుక్కకాటుకు గురైతే ఒక్కో పంటి గాటుకు రూ.10 వేలు

దేశవ్యాప్తంగా పెరిగిన శునకాల దాడులు, వాటి నియంత్రణ గురించి జరుగుతున్న చర్చల గురించి నిత్యం సోషల్ మీడియా లోనూ, టీవీ న్యూస్ ఛానెల్స్ లోనూ చూస్తూనే ఉంటాం. ఈ దాడులు మూలంగా కొన్ని సార్లు జీవితాలే మారిపోతాయి. దీంతో ఈ దాడులను నియంత్రించడం కోసం పంజాబ్ – హరియాణా హైకోర్టు ఓ సంచలన తీర్పునిచ్చింది.

ఇటీవల శునకం దాడి సంబంధించిన కేసులో పంజాబ్ – హరియాణా హైకోర్టు (High Court) ఆసక్తికర తీర్పు వెలువరించింది. వీధి శునకాలు, ఇతర జంతువుల దాడి కేసులో పరిహారం చెల్లించాల్సిన ప్రాథమిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. కుక్కకాటుకు గురైన వ్యక్తికి ఒక్కో పంటి గాటుకు కనీసం రూ.10 వేలు చెల్లించాలని, తీవ్ర గాయమైతే, అది 0.2 సెం.మీ మేర కోతపడినట్లయితే రూ.20వేల పరిహారం చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.

What do you think?

ప్రజలు ఆలోచించి ఓటువేయాలి – సీఎం కేసీఅర్

బెంగళూరులోని టిసిఎస్ క్యాంపస్‌ కు బాంబు బెదిరింపు