in

మహిళల సహాయం కోసం కేంద్రం “ఉద్యోగిని” పథకం

మహిళల సహాయం కోసం కేంద్రం “ఉద్యోగిని” పథకం

తమ కాళ్ళ మీద తాము నిలబడాలని, జీవితంలో ఎదగాలని చాలా మంది మహిళలు ప్రయత్నిస్తుంటారు. సొంతం వ్యాపారం ప్రారంభించి విజయం సాధించాలని కలలు కంటుంటారు. కానీ సరైన అవకాశం దొరకక లేదా అవసరమైనంత డబ్బు లేక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని అమలు చేస్తోంది.

వ్యాపారం చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకోవాలనుకునే మహిళల సహాయం కోసం కేంద్ర ప్రభుత్వం వుమెన్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ‘ఉద్యోగిని’ పథకం అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా మహిళలు రూ.3 లక్షల వరకు వడ్డీ లేని రుణం పొందొచ్చు. దివ్యాంగ, వితంతు మహిళలకు వారి అర్హతను బట్టి రూ.3 లక్షల కంటే ఎక్కువ రుణాన్ని కూడా ఇస్తారు. అయితే ఈ పథకం కింద రుణాన్ని పొందాలి అంటే వారి వయసు 18 నుంచి 55 ఏళ్లలోపు ఉండాలి. వారి క్రెడిట్/సిబిల్ స్కోర్ బాగుండాలి. ఈ అర్హతలన్నీ ఉన్న మహిళలు సమీపంలోని బ్యాంకులను సంప్రదించి ఈ ‘ఉద్యోగిని’ పథకాన్ని పొందొచ్చు.

What do you think?

మేనిఫెస్టో రూపొందించనున్న టీడీపీ-జనసేన కమిటీ

ప్రజలు ఆలోచించి ఓటువేయాలి – సీఎం కేసీఅర్