in

మీకు ఎమర్జెన్సీ అలర్ట్ రాలేదా..? ఫోన్ లో ఈ సెట్టింగ్స్ మార్చుకోండి

మీకు ఎమర్జెన్సీ అలర్ట్ రాలేదా..? ఫోన్ లో ఈ సెట్టింగ్స్ మార్చుకోండి

సునామీ, భూకంపాలు వంటి ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలను అప్రమత్తం చేయడానికి భారత ప్రభుత్వం ఎమర్జెన్సీ అలెర్ట్ వ్యవస్థను (Emergency alert system) రూపొందించిందన్న విషయం తెలిసిందే. ఆకస్మిక పరిస్థితుల్లో ప్రజలకు అలెర్ట్ మెసేజ్ ద్వారా సమాచారం పంపేందుకు ఈ వ్యవస్థను ప్రభుత్వం రూపొందించింది. ఇప్పటికే చాలా మందికి ఈ ఎమర్జెన్సీ అలెర్ట్ వచ్చింది. దీనిపై కూడా ప్రభుత్వం అందరికీ క్లారిటీ ఇచ్చింది. అయితే ఒక వేళ మీకు ఈ అలెర్ట్ మెసేజ్ రాకపోయుంటే వెంటనే మీ ఫోన్ లో ఈ సెట్టింగ్స్ మార్చుకోండి.

ముందుగా ఫోన్ లో సెట్టింగ్స్ (settings) లోకి వెళ్లి అక్కడ “wireless Emergency notification” అని సెర్చ్ (search) చేయండి. ఆ తరువాత అందులో అలెర్ట్స్ ను ఆన్ (on) లో పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల ఇక నుంచి ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని అలర్ట్స్ మీరు పొందగలుగుతారు. కాగా ప్రస్తుతం ఈ సర్వీస్ టెస్టింగ్ దశలో ఉండగా.. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దశలు వారీగా ఈ టెస్టింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

What do you think?

5 గంటలు పాటు ఈత కొట్టి.. రికార్డు సృష్టించిన 9 ఏళ్ల చిన్నారి

తక్కువ వడ్డీకి రూ.10 లక్షల లోన్ ఇవ్వనున్న కేంద్రం