in

గుండె పోటని నాటకమాడి 20 రెస్టారెంట్లకు టోపీ

గుండె పోటని నాటకమాడి 20 రెస్టారెంట్లకు టోపీ

ఓ వ్యక్తి గుండె పోటని నాటకమాడి 20 రెస్టారెంట్లకు టోపీ పెట్టాడు. చివరికి ఓ రెస్టారెంట్ సిబ్బందికి అనుమానం వచ్చి పోలీసులకు ఫోన్ చేయడంతో చిక్కాడు.

వివరాల్లోకి వెళ్తే స్పెయిన్ లో 50 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి గత కొన్ని రోజులుగా రెస్టారెంట్ల సిబ్బందిని తప్పుదోవ పట్టిస్తూ బిల్లు ఎగ్గొట్టి తప్పించుకుంటున్నాడు. నచ్చిన ఆహారాన్ని తిని బిల్లు కట్టే సమయంలో గుండెపోటు వచ్చిందంటూ నాటకమాడి సిబ్బందిని మాయ చేస్తున్నాడు. అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20కి పైగా రెస్టారెంట్లను మోసం చేశాడు.

అయితే ఈ క్రమంలో ఇటీవల ఓ రెస్టారెంట్కు వెళ్లిన ఆ వ్యక్తి ఆహారం తిని అక్కడ సిబ్బంది ఎవరూ లేకపోవడంతో తప్పించుకునేందుకు ప్రయత్నం చేశాడు. కానీ అంతలోనే సిబ్బంది అక్కడికి వచ్చి అతడిని అడ్డుకున్నారు. హోటల్ రూంలో డబ్బులు ఉన్నాయని, తీసుకొచ్చేందుకు వెళుతున్నట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ అతడు వెళ్లేందుకు నిరాకరించిన సిబ్బంది వెంటనే డబ్బులు చెల్లించాలని పట్టుబట్టారు.

ఇంతలో తనకు గుండెపోటు వచ్చిందని, అంబులెన్స్ కు ఫోన్ చేయాలని రెస్టారెంట్ సిబ్బందిని కోరాడు. అతడు నాటకమాడుతున్నట్లు గమనించిన సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో గుండె పోటని నమ్మించి టోపీ పెడుతున్న నిందితుడిని పొలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు.

What do you think?

దేశంలోనే తొలి హైస్పీడ్ రైలు. ప్రారంభించనున్న మోదీ

రూ.16 కోట్ల లాటరీ గెలుచుకున్నాడు. నెలకి రూ.5.6 లక్షలు..