in ,

అరుదైన ఘనతను నమోదు చేసిన రోహిత్ శర్మ. 53 సిక్స్‌లు

అరుదైన ఘనతను నమోదు చేసిన రోహిత్ శర్మ. 53 సిక్స్‌లు

రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఏడాదిలో ఇప్పటివరకు 53 సిక్స్‌లు కొట్టి ఈ ఘనత సాధించిన మూడో వ్యక్తిగా నిలిచాడు.

న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనతను నమోదు చేశాడు. కివీస్‌తో మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ 4 ఫోర్లు, 4 సిక్స్‌లు కొట్టాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ వన్డేల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో 50 లేదా అంతకంటే ఎక్కువ సిక్స్‌లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. రోహిత్‌ ఈ ఏడాదిలో ఇప్పటివరకు 53 సిక్స్‌లు కొట్టాడు.

ఈ ఘనత సాధించిన జాబితాలో రోహిత్‌ మూడో స్ధానంలో నిలిచాడు. కాగా అతనికంటే ముందు 58 సిక్స్‌లతో ఏబీ డివిలియర్స్‌ తొలి స్ధానంలో ఉండగా.. క్రిస్‌ గేల్‌ 56 సిక్స్‌లతో రెండో స్ధానంలో కొనసాగుతున్నారు.

What do you think?

ఇతను కొండచిలువను మెడలో వేసుకుని ఫోటో తీసుకునే ప్రయత్నం చేశాడు

మద్యం మత్తులో బాంబు కొరికి ప్రాణాలు కోల్పోయాడు