in ,

బెన్ స్టోక్స్ ను దారుణంగా అవమానించిన ఆస్ట్రేలియా

బెన్ స్టోక్స్ ను దారుణంగా అవమానించిన ఆస్ట్రేలియా

 

బెన్ స్టోక్స్‌ను ఆస్ట్రేలియా మీడియా ఘోరంగా అవమానించింది. ఓ పసిబాలుడి ముఖాన్ని స్టోక్స్‌గా మార్ఫింగ్ చేసి ప్రచురించింది.

విషయం ఏంటంటే యాషెస్ రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఐదో రోజు ఆటలో ఇంగ్లండ్ బ్యాటర్ బెయిర్ స్టో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఔటయ్యాడు. బంతి కీపర్ చేతిలో ఉండగానే ఓవర్ పూర్తైందనుకుని బెయిర్ స్టో క్రీజు దాటాడు. దీన్ని గమనించిన ఆస్ట్రేలియా వికెట్ కీపర్ ఆలెక్స్ క్యారీ వెంటనే స్టంపౌట్ చేశాడు. దీనిని సుదీర్ఘంగా పరిశీలించిన అనంతరం థర్డ్ అంపైర్ చివరకు బెయిర్ స్టో ఔటైనట్టుగా ప్రకటించాడు. ఈ నిర్ణయం ఇంగ్లండ్ జట్టు ఓటమి పై తీవ్ర ప్రభావం చూపించింది. ఇది ఆ జట్టు ఓడిపోవడానికి కారణం అయింది. దీంతో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఆటగాళ్లతో పాటు మాజీలు, మీడియా మధ్య వివాదం రాజుకుంది.

ఈ వివాదంలో భాగంగా ఇంగ్లండ్ మీడియా ‘ఛీటర్స్’ అంటూ అనేక కథనాలు ప్రచురించింది. ఆ కథనాలకు కౌంటర్‌ గానే ఆస్ట్రేలియా కూడా ‘ది వెస్ట్ ఆస్ట్రేలియన్’ అనే పత్రికలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఫొటో మార్ఫింగ్ చేసి క్రైబేబీస్ అనే ఓ శీర్షికతో కథనం ప్రచురించింది. ఈ కథనంలో ఓ పసిబాలుడి ముఖాన్ని స్టోక్స్‌గా మార్ఫింగ్ చేసి ప్రచురించింది. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యి చక్కర్లు కొడుతుంది.

అయితే ఈ పోస్టు పై బెన్ స్టోక్స్‌ స్పందించాడు. ‘ఇది కశ్చితంగా నేనైతే కాదు. ఎందుకంటే కొత్త బంతితో బౌలింగ్ నేనెప్పుడు చేశాను?’ అంటూ రిప్లై ఇచ్చాడు.

What do you think?

ఈ వర్షా కాలంలో వాటికి రక్షణ కల్పించండి – రతన్ టాటా

కొన్నాళ్ళు సినిమాల నుంచి బ్రేక్ తీసుకోనున్న సమంత.