in

ఈ వర్షా కాలంలో వాటికి రక్షణ కల్పించండి – రతన్ టాటా

ఈ వర్షా కాలంలో వాటికి రక్షణ కల్పించండి – రతన్ టాటా

 

ఇది వర్షా కాలం అయినందు వల్ల కుక్కలు, పిల్లులు వంటి మూగజీవులు తల దాచుకోవడానికి బళ్ళు, కార్లు, లారీల కిందకు వెళ్తుంటాయి. ఈ క్రమంలో అవి కొన్ని సార్లు వాటి ప్రాణాలు కూడా కోల్పోతాయి. ఇది జరగకుండా ఉండాలన్న ఉద్దేశంతో ప్రముఖ పారశ్రామికవేత్త రతన్ టాటా (Ratan tata) సోషల్ మీడియా వేదికగా ప్రజలను రిక్వెస్ట్ చేశారు.

‘వర్షాకాలం వచ్చేసింది. ఈ వానల్లో మన కార్ల కింద పిల్లులు, వీధి కుక్కలు తలదాచుకుంటుంటాయి. కారును మలుపు తిప్పి, ముందుకు పోనిచ్చేప్పుడు దాని కింద ఒకసారి తనిఖీ చేసుకోండి. లేకపోతే అవి తీవ్రంగా గాయపడటమో.. చనిపోవడమో.. జరుగుతుంది. అలా జరగకుండా ఉండాలంటే ఈ వర్షాకాలంలో మూగజీవాల కోసం తాత్కాలిక షెల్టర్లు మీరు ఏర్పాటు చేస్తే.. ఉపయోగకరంగా ఉంటుంది’ అంటూ రతన్ టాటా తన ఇన్స్టాలో ఓ పోస్టు పెట్టారు. అలా ఓ చిన్న పోస్టుతో ఆయన మూగజీవుల రక్షణ కోసం అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.

What do you think?

విడియోలో కన్నీళ్లు పెట్టుకున్న దుల్కర్ సల్మాన్

బెన్ స్టోక్స్ ను దారుణంగా అవమానించిన ఆస్ట్రేలియా