in

ట్విట్టర్ లో ఆడియో – వీడియో కాల్స్. యాక్టివేట్ చేసుకోండిలా..

ట్విట్టర్ లో ఆడియో – వీడియో కాల్స్. యాక్టివేట్ చేసుకోండిలా..

ఎక్స్ (ట్విట్టర్) ఒక సరికొత్త ఫీచర్ ను తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ద్వారా ఫోన్ నంబర్ అవసరం లేకుండానే ఆడియో లేదా వీడియో కాల్స్ చేసుకోవచ్చు.

ఎలోన్ మస్క్ ట్విట్టర్ (twitter) ను సొంతం చేసుకున్నప్పటి నుంచి ఆ ప్లాట్ ఫార్మ్ ను ‘ఎవ్రీథింగ్ యాప్’ గా మారుస్తామని చెప్పుకొచ్చారు. ఆ విధంగానే ట్విట్టర్ లో సబ్స్క్రిపషన్స్ (subscriptions) తీసుకొచ్చారు. “ట్విట్టర్” పేరును కూడా “ఎక్స్” (X) అని ఆర్చేశారు. ఇలాగే యాప్ లో చాలా మార్పులే తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే ఆగస్ట్ లో “ఎక్స్” (ట్విట్టర్) లో వీడియో, ఇంకా ఆడియో కాల్స్ చేసుకునే ఫీచర్ ను తీసుకురాబోతున్నట్లు తెలిపారు. చెప్పిన విధంగానే ఇప్పుడు ఆ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ విషయాన్ని తెలియ చేస్తూ ఎలోన్ మస్క్ తన ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టారు.

ట్విట్టర్ లో కాల్స్ చెయ్యడానికి ఫోన్ నంబర్ అవసరం లేదు. అయితే ప్రస్తుతానికి కొందరికి మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.

కాగా ఆండ్రాయిడ్, ఐఓఎస్, మ్యాక్, పీసీలు ఈ కాలింగ్ ఫీచర్ సపోర్ట్ చేస్తాయి. దీన్ని యాక్టివేట్ చేసుకోవాలనుకునే వారు సెట్టింగ్స్ (settings) లోకి వెళ్లి ‘Privacy & Safety’ ఆప్షన్పై క్లిక్ చేసి‘Direct Messages’ ఆప్షన్ను ఎంచుకొని ‘Enable_Audio & Video Calling’ ఫీచర్ ని ఎనేబల్ (Enable ) చేసుకోవాలి.

What do you think?

స్నేహితుడి ప్రపోజల్ అంగీకరించిన అమలాపాల్. త్వరలో పెళ్లి

కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి పరీక్షల తేదీలు విడుదల