in ,

ఈ 5 సినిమాలు చూశారా? చూడకపోతే చూసేయండి

ఈ 5 సినిమాలు చూశారా? చూడకపోతే చూసేయండి

1. కొలేట్రల్ (collateral)

మ్యాక్స్ లాస్ ఏంజెల్స్ (Las Angeles) లో టాక్సీ డ్రైవర్ గా పని చేస్తుంటాడు. ఒక రోజు ఎప్పటిలాగే ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడి ఇక ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటాడు. కానీ ఆ టైoలో విన్సెంట్ అనే ఒక వ్యక్తి మ్యాక్స్ దగ్గరకు వచ్చి తను కాదనలేని ఆరు వందల డాలర్ల (600$) ఫైవ్ స్టాప్ రైడ్ ని ఆఫర్ చేస్తాడు. మ్యాక్స్ కి అది మంచి డీల్ అనిపించి రైడ్ కి ఒప్పుకుంటాడు. కానీ ఫస్ట్ స్టాప్ రైడ్ పూర్తి కాగానే విన్సెంట్ అసలు రూపం బయటపడుతుంది. విన్సెంట్ ఒక హిట్ మ్యాన్ అని మ్యాక్స్ కి తెలుస్తుంది. ఇక అక్కడి నుంచి మ్యాక్స్ చావు బ్రతుకుల పోరాటం మొదలవుతుంది.

2. గెట్ ఔట్ (get out)

ఫోటోగ్రాఫర్ అయిన క్రిస్ వాషింగ్టన్ (black person) తన గర్ల్ ఫ్రెండ్ అయిన రోజ్ ఆర్మిటేజ్ (white person) కుటుంబాన్ని కలవడానికి వీకెండ్ లో రోజ్ తో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ అందరూ క్రిస్ నచ్చి నట్లే ఉంటారు. క్రిస్ కూడా వాళ్ళని నమ్ముతాడు. కానీ రోజులు గడిచే కొద్దీ రోజ్ కుటుంబం నిజమైన రంగులు బయటపడతాయి. చివరికి క్రిస్ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది.

3. ప్రతినిధి (prathinidhi)

ఒక మామూలు వ్యక్తి ఆంద్రప్రదేశ్ సీఎం (CM) ని కిడ్నాప్ చేస్తాడు. అతని డిమాండ్స్ తీర్చకపోతే సీఎం ప్రాణానికి ప్రమాదం అని బెదిరిస్తాడు. అక్కడి నుంచి ఆ సామాన్యుడు చేసే డిమాండ్స్ ద్వారా కొన్ని చేదు నిజాలు బయటపడతాయి.

ఆ సామాన్యుడు సీఎంని ఎందుకు కిడ్నాప్ చేశాడు? అతని వెనుక ఉన్న కథేంటి? అన్న విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

4. వేకప్ సిడ్ (wakeup sid)

రిచ్ ఫ్యామిలీకి చెందిన సిద్ధార్థ్ మెహ్రా (Siddharth Mehra) గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన తరువాత వాళ్ళ నాన్న కంపనీలో పనిచేస్తాడు. కానీ కొన్ని రోజులకే అది బోర్ కొట్టి బిజినెస్ చూసుకోవడం మానేసి కాళీగా తిరుగుతుంటాడు. ఆ సమయంలో సిద్ధార్థ్, రైటర్ అవ్వాలని కలలు కంటున్న ఐషా అనే అమ్మాయిని కలుసుకుంటాడు. ఆ అమ్మాయి స్నేహం సిద్ధార్థ్ జీవితంలో ఎలాంటి మార్పు తీసుకువచ్చింది అన్నది మిగతా కథ.

5. మై నేమ్ ఈస్ ఖాన్ (My name is khan)

ఆస్పెర్గర్స్ సిండ్రోమ్ (Asperger’s syndrome) ఉన్న రిజ్వాన్ ఖాన్ మందిరా అనే ఓ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాడు. వారి జీవితం ఎంతో ఆనందంగా, అందంగా సాగుతుంటుంది. కానీ ఆ సమయంలో ట్విన్ టవర్స్ (twin towers) ఆటాక్ జరుగుతుంది. ఆ సంఘటన రిజ్వాన్ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. తన జీవితంలో తను అన్నీ కోల్పోయేలా చేస్తుంది.

దీంతో తను పోగొట్టుకున్న జీవితాన్ని మళ్లీ తిరిగి దక్కించుకోడానికి రిజ్వాన్ ఖాన్ అమెరికా ప్రెసిడెంట్ (america president) ని కలిసి, తన కమ్యూనిటీ (community) మీద పడిన మచ్చను పోగొట్టే ఒక ప్రమాదకరమైన ప్రయాణాన్ని మొదలు పెడతాడు.

What do you think?

బంగ్లాదేశ్‌ పై ఆస్ట్రేలియా ఘన విజయం

సౌతాఫ్రికా జట్టుకు భారీ షాక్. టెంబా సెమీ ఫైనల్ లో ఆడకపోవచ్చు