in ,

భోళాశంకర్ నిర్మాతలకు చెక్ తిరిగిచ్చేసిన చిరు

భోళాశంకర్ నిర్మాతలకు చెక్ తిరిగిచ్చేసిన చిరు

మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ మూవీ డిజాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా కొన్ని రోజుల క్రితం సినిమా ఫ్లాప్ అయినా సరే రావల్సిన రెమ్యునేషన్ను చిరు డిమాండ్ చేస్తున్నారని కొన్ని పుకారులు పుట్టుకొచ్చాయి.

అయితే తాజాగా మెగాస్టార్ తన రెమ్యునరేషన్ ని తిరిగి ఇచ్చేశారని వార్తలు వస్తున్నాయి. వాల్తేరు వీరయ్య సినిమాకు చిరు రూ.50 కోట్లు తీసుకోగా.. భోళాశంకర్ సినిమా కోసం రూ.60 కోట్లు డిమాండ్ చేశారని తెలిసింది. ఈ క్రమంలో భోళాశంకర్ సినిమా కోసం తొలుత రూ.50 కోట్లు ఇచ్చిన నిర్మాతలు మరో రూ.10 కోట్లు చెక్‌ రూపంలో అందించారట. అయితే ఆ చెక్‌ను అలాగే ఉంచిన చిరు.. సినిమా విడుదల తర్వాత బ్యాంకుకు పంపాలనుకున్నారట. కానీసినిమా డిజాస్టర్‌ కావడంతో చిరంజీవి ఆ చెక్‌ను నిర్మాత అనిల్ సుంకరకు ఇచ్చేశారని తెలుస్తుంది.

What do you think?

ఏడుగురు శిశువులను హతమార్చిన నర్సు

బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ వీరేనా..?!