in

ఏడుగురు శిశువులను హతమార్చిన నర్సు

ఏడుగురు శిశువులను హతమార్చిన నర్సు

ఇంగ్లాండ్‌ లోని ఓ నర్సు వైద్య వృత్తికే కలంకం తెచ్చింది. ఎవ్వరికీ అనుమానం రాకుండా ఏడుగురు శిశువులను కడతేర్చింది.

వివరాల్లోకి వెళ్తే 2015-16 సంవత్సరాల మధ్యలో ఇంగ్లాండ్ లోని కౌంటెస్‌ ఆఫ్‌ చెస్టర్‌ ఆస్పత్రికి చెందిన 33 ఏళ్ల లూసీ లెబ్టీ అనే ఓ నర్సు శిశువుల వార్డులో పని చేస్తుండేది. ఆ సమయంలో లూసీ ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడుతూ ఆసుపత్రిలో శిశువులను ఇంజెక్షన్ ద్వారా శిశువుల రక్తంలోకి గాలిని పంపడం, నాసోగ్యాస్ట్రిక్ గొట్టాల (nasogastrictube) ద్వారా వారి కడుపులోకి పాలు, నీటిని బలవంతంగా పంపడం వంటివి చేసి పసి పిల్లలను చంపుతుండేది. ఇదే విధంగా లూసీ ఏడుగురు శిశువుల ప్రాణాలు తీసింది.

అయితే ఆ ఆసుపత్రిలోనే డాక్టర్ గా పనిచేస్తున్న రవి జయరామ్ కి ఓ రాత్రి లూసీ నవజాత శిశువుల వార్డులో ఇంక్యుబేటర్ పక్కన కనిపించడంతో ఆమె మీద జయరామ్ కి అనుమానం వచ్చింది.

దీంతో వెంటనే ఆమె గురించి జయరామ్ నేషనల్ హెల్త్ సర్వీస్ ట్రస్ట్ కు తెలియచేశాడు. కానీ వారు జయరామ్ ను పిర్యాదుకు అంగీకరించలేదు. వారు నిరాకరించడంతో జయరామ్ పోలీసులకు ఈ విషయాన్ని తెలియచేయగా.. వారు పది నిమిషాల్లో లూసీను అరెస్టు చేశారు.

2018 జులైలో లూసీని పోలీసులు అరెస్టు చేశారు. నవంబరు 2020న అభియోగాలు మోపారు. అప్పటి నుంచి ఈ కేసు నడుస్తూనే ఉంది. అయితే తాజాగా న్యాయస్థానం ఆమెను దోషిగా తేల్చింది. త్వరలో ఆమెకు శిక్ష ఖరారు కానుంది.

What do you think?

ఇక డ్రైవింగ్‌ లైసెన్స్, ఆర్‌సీ కార్డులు ఉండవు. రవాణాశాఖ కీలక నిర్ణయం

భోళాశంకర్ నిర్మాతలకు చెక్ తిరిగిచ్చేసిన చిరు