in

ఇక డ్రైవింగ్‌ లైసెన్స్, ఆర్‌సీ కార్డులు ఉండవు. రవాణాశాఖ కీలక నిర్ణయం

ఇక డ్రైవింగ్‌ లైసెన్స్, ఆర్‌సీ కార్డులు ఉండవు. రవాణాశాఖ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌ రవాణాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి డ్రైవింగ్‌ లైసెన్సులు, ఆర్‌సీ కార్డులను ఆపేస్తునట్లు తెలిపింది.

వివరాల్లోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వం ‘వాహన్‌ పరివార్‌’ పేరుతో రవాణా సేవలల్ని ఆన్‌లైన్ చేసింది. ఇప్పటికే ఈ పద్ధతిని చాలా వరకు రాష్ట్రాల్లో అమలు చేశాయి. అయితే ఇప్పుడు తాజాగా ఆంద్రప్రదేశ్ కూడా ఈ భాటలో అడుగులు వేయడానికి సిద్దం అయ్యింది.

ఈ క్రమంలోనే ఇకపై డ్రైవింగ్‌ లైసెన్సులు, ఆర్‌సీలు కార్డు రూపంలో జారీ చేయమని తెలిపింది. ఇక నుంచి వాహన దారులు డ్రైవింగ్‌ లైసెన్సులు, ఆర్‌సీలను ఆన్‌లైన్‌లో డౌన్‌లౌడ్‌ చేసుకోవల్సి ఉంటుందని ప్రకటిస్తూ ఉత్తరువులు జారీ చేసింది.

వాహన దారులు ప్రయాణించే తప్పుడు పోలీసుల ఆపితే ఫోన్ లో డ్రైవింగ్‌ లైసెన్సులు, ఆర్‌సీలను డౌన్లోడ్ చేసుకుని చూపిస్తే సరిపోతుందని.. కావాలనుకున్న వాళ్ళు వాటిని ప్రింట్ తీయించుకోవచ్చని తెలిపింది.
ఈ విషయంపై రవాణాశాఖ కమిషనర్‌ మాట్లడుతూ ఇప్పటివరకూ కార్డు కోసం చెల్లిస్తున్న రూ.225 చలానా ఇక కట్టాల్సిన పనిలేదని  పేర్కొన్నారు.

What do you think?

చాట్ జీపీటీకి దీటుగా కొత్త గూగుల్ ఏఐ ఫీచర్

ఏడుగురు శిశువులను హతమార్చిన నర్సు