in

చాట్ జీపీటీకి దీటుగా కొత్త గూగుల్ ఏఐ ఫీచర్

చాట్ జీపీటీకి దీటుగా కొత్త గూగుల్ ఏఐ ఫీచర్

చాట్ జీపీటీ తరహాలో గూగుల్ క్రోమ్ ఓ ఏఐ ఫీచర్ తీసుకు వచ్చింది. ఇకపై ఆ ఫీచర్ ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ సమాచారం తెలుసుకోవచ్చని గూగుల్ ఓ బ్లాగ్ ద్వారా తెలిపింది.

గూగుల్ న్యూ ఫీచర్ : దేని గురించైనా తెలుసుకోవాలని గూగుల్ లో సెర్చ్ చేస్తే బోలెడన్ని వెబ్సైట్స్ మన ముందు ప్రత్యక్షమవుతాయి. అందులో మనకి కావల్సినది కొంత ఉంటే మిగతాది అంతా అనవసరమైన సమాచారం ఉంటుంది. దీని వల్ల యూజర్ సమయం, ఎనర్జీ రెండూ వృధా అవుతాయి.

దీనికి సొల్యూషన్ గానే ఓపెన్ ఏఐ (Open AI) కంపెనీ చాట్ జీపిటీ (chat gpt) అనే ఓ ఆర్టిఫీషియల్ సెర్చ్ ఇంజిన్ ని మన ముందుకు తీసుకువచ్చింది. ఈ చాట్ జీపీటీ తక్కువ సమయంలో మనకి కావాల్సిన సమాచారం తక్కువ పదాలలో అందిస్తుంది. దీని వల్ల తెలుసుకోవాలనుకున్న సమాచారం త్వరగా తెలుసుకోగలుగుతాము. ఇది అందరికీ తెలిసిన విషయమే. చాట్ జీపీటీ లాంచ్ అయినప్పటిని సోషల్ మీడియా ఈ పేరు ఓ మోత మోగింది.

అయితే ఇప్పుడు తాజాగా గూగుల్ కూడా ఈ చాట్ జీపీటీ తరహాలో సేవలు అందించేందుకు సిద్దం అవుతోంది.

గూగుల్ క్రోమ్ ఇప్పటికే సెర్చ్ జనరేటీవ్ ఎక్స్పీరియన్స్ (SGE) పేరుతో చాట్ జీపీటీ తరహాలో ఏఐ ఆధారిత ఫీచర్ని యూజర్లకు పరిచయం చేసింది. అయితే ట్రైయల్ దశలో ఉన్న ఈ ఫీచర్ 3 నెలల క్రితం కొందరు ఆండ్రోయిడ్, ఐఫోన్ యూజర్లకు మాత్రమే పరిచయం చేయగా.. త్వరలోనే ఇది అందరికీ అందుబాటులో ఉంటుందని గూగుల్ వైస్ ప్రెసిడెంట్ రానే తెలిపారు.

‘ఈ ఎఈ ఫీచర్ని యాక్టివేట్ చేసుకొని గూగుల్ బ్రౌజర్లో వెతికితే.. సమాచారం క్లుప్తంగా తక్కువ పదాలతో వస్తుంది. అందులో ముఖ్యమైన కీ వర్డ్స్ (key words)పై కర్సర్ ఉంచితే ఆ పదాల అర్థం కూడా అక్కడే కనిపిస్తుంది. దీంతో పాటు ఫోటోలు కూడా డిస్ప్లే (display) అవుతాయి. దీని వల్ల స్క్రీన్ టైం తగ్గటంతో పాటూ సమాచారం వెంటనే లభిస్తుంది.’ అని రానే ఎనీ సంస్థ అఫిషియల్ బ్లాగ్ ద్వారా తెలిపారు.

ఇక ఈ ఫీచర్ ని ట్రై చేయాలి అనుకున్నవారు దీన్ని సులువుగా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా గూగుల్ క్రోమ్ ను అప్డేట్ చేసుకోవాలి. ఆ తరువాత అందులో ‘గూగుల్ సెర్చ్ ల్యాబ్స్’ వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి. అక్కడ ‘SGE while browsing’ అనే ఫీచర్ ని యాక్టివేట్ చేసుకోవాలి. అంతే ఇక సులువుగా కావాలనుకున్న సమాచారాన్ని తక్కువ పదాలతో క్లుప్తంగా పొందవచ్చు.

What do you think?

సినిమా విడుదల కాకపోవడంతో నిర్మాతకు గుండెపోటు

ఇక డ్రైవింగ్‌ లైసెన్స్, ఆర్‌సీ కార్డులు ఉండవు. రవాణాశాఖ కీలక నిర్ణయం