in

‘గేమ్ ఛేంజర్‌’ పాట లీక్ చేసిన నిందితులు అరెస్ట్

‘గేమ్ ఛేంజర్‌’ పాట లీక్ చేసిన నిందితులు అరెస్ట్

కొన్ని రోజుల క్రితం రామ్‌ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్‌’ సినిమాలోని ఓ పాట లీక్ అయిందన్న విషయం తెలిసిందే. ఈ ‘జరగండి జరగండి’ అనే పాట సోషల్ మీడియాలో లీకైన మరుక్షణమే వైరల్ గా మారింది.

కాగా ఈ పాట విన్న వాళ్ళందరూ ఇదేం పాటని అంటూ నెట్టింట తెగ ట్రోల్ చేశారు. దీనిపై ‘గేమ్ ఛేంజర్‌’ మూవీ టీమ్ కూడా స్పందించింది. పూర్తిగా సిద్దం కానీ పాటను ఇలా విడుదల చేసినవారిని క్షమించేది లేదని, వారికి తగిన శిక్ష పడేలా చేస్తామని సోషల్ మీడియా ద్వారా పేర్కొంది.

అయితే తాజాగా ఆ పాటను లీక్ చేసిన నిందితులు అరెస్టు అయ్యారు. మేకర్స్ ఫిద్యాదుతో దీనిపై విచారణ జరిపిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఇద్దరి నిందితులను అరెస్ట్‌ చేశారు. వారిపై ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

What do you think?

మూడే నిమిషాల్లో కోవిడ్ ను నిర్ధారించే పరికరం

బాలీవుడ్ లో రీమేక్ కాబోతున్న “బేబి”