in ,

“దీపావళి ఆ రోజునే జరుపుకోవాలి” – వేద పండితులు

“దీపావళి ఆ రోజునే జరుపుకోవాలి” – వేద పండితులు

కొన్ని సంవత్సరాలుగా మన పండగలు అన్నీ రెండు రెండు రోజులు వస్తున్నాయి. ఒక రోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం మొదలై ఆ మరుసటి రోజు వరకు పండగ కొనసాగుతోంది. ఈ ఏడాది వినాయక చవితి, దసరా కూడా ఇలాగే వచ్చాయి. ఇప్పుడు వస్తున్న దీపావళి కూడా ఇదే విధంగా రెండు రోజులు వస్తుంది. దీంతో పండగ ఏ రోజు జరుపుకోవాలి అన్న ప్రశ్నతో ప్రజలు తికమక పడుతున్నారు.

ఈ సారి దీపావళి నవంబర్ 12 నుంచి ఆ మరుసటి రోజు 13వ తేదీ వరకు ఉంటుంది. దీంతో దీనిపై వేద పండితులు ప్రజలకు క్లారిటీ ఇచ్చారు.

“కార్తీక మాస అమావాస్య నవంబర్ 12 మధ్యాహ్నం 2:44 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు 13న మధ్యాహ్నం 2:56 గంటలకు ముగుస్తుంది. దీపావళి అంటే సాయంత్రం లక్ష్మీపూజ చేసి, దీపాలు వెలిగిస్తాం. కాబట్టి అమావాస్య ఘడియలు సాయంత్రానికి ఉన్న రోజునే పరిగణలోకి తీసుకోవాలి. అందుకే నవంబరు 12నే దీపావళి పండగను జరుపుకోవాలి” అని పండితులు చెబుతున్నారు.

What do you think?

జగన్‌ అక్రమాస్తుల కేసులపై సీబీఐ కోర్టు విచారణ

ప్రమోషనల్ కంటెంట్ పంపాలంటే యూజర్ అనుమతి కావాలి