in ,

విడాకులపై నవ్వుతూనే ఘాటు సమాధానం ఇచ్చిన స్వాతి

విడాకులపై నవ్వుతూనే ఘాటు సమాధానం ఇచ్చిన స్వాతి

కొన్ని రోజులుగా ఆమె విడాకులపై వస్తున్న వార్తలపై కలర్స్ స్వాతి స్పందించారు. తను సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని ఘాటుగా సమాధానం ఇచ్చారు.

కలర్స్ ప్రోగ్రాంతో ప్రేక్షకుల మనసులకు దగ్గరై తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో మంచి మంచి అవకాశాలు అందిపుచ్చుకున్న కలర్స్ స్వాతి విడాకులు తీసుకున్నారని సోషల్ మీడియా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ విషయంపై ఇటీవల స్వాతి స్పందించారు. తను నటించిన ‘మంత్ ఆఫ్ మధు’ సినిమా ప్రచారంలో పాల్గొన్న ఆమె విలేకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ “నేను కలర్స్ ప్రోగ్రాం చేసినప్పుడు నాకు 16 ఏళ్లు. అప్పుడు సోషల్ మీడియా ఉండుంటే నన్ను ఫుట్బాల్ ఆడుకునే వారు. ఇప్పుడున్న నటీనటులు వాటిని ఎలా హ్యాండిల్ చేస్తున్నారో. నాకంటూ జీవితంలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. వాటికి కట్టుబడి నేను నా విడాకులపై స్పందించను. నేను దానిపై సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఇవ్వ.” అంటూ నవ్వుతూనే ఘాటుగా సమాధానమిచ్చారు.

What do you think?

చంద్రబాబు అరెస్ట్ పై కేటీఆర్. “ఇక్కడ ర్యాలీలు చేస్తే ఊరుకోం.”

ముందస్తుగానే భూకంపాల అలర్ట్ ఇచ్చే గూగుల్ వ్యవస్థ