in ,

ముందస్తుగానే భూకంపాల అలర్ట్ ఇచ్చే గూగుల్ వ్యవస్థ

ముందస్తుగానే భూకంపాల అలర్ట్ ఇచ్చే గూగుల్ వ్యవస్థ

ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు సహాయ పడేందుకు గూగుల్ ఓ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు గూగుల్ తెలిపింది. ఆండ్రాయిడ్ యూజర్లకు భూకంప అప్రమత్త సందేశాలను పంపే వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు గూగుల్ ఇటీవల ప్రకటించింది.

భూకంపాలు రాబోయే ప్రదేశంలో ఈ కొత్త గూగుల్ వ్యవస్థ ముందస్తుగానే ప్రజలకు భూకంపాల సందేశాలు పంపిస్తుంది. ఇందుకోసం NDMA, NSCతో కలిసి పని చేయనుంది. కాగా ఆండ్రాయిడ్ 5 ఆపై వెర్షన్లకు ఇది అందుబాటులో ఉంటుంది. ఇలాంటి వ్యవస్థను ఇప్పటికే పలు దేశాల్లో అమలు చేస్తోన్న గూగుల్, ఈ అలర్ట్ లు ఆండ్రాయిడ్ సపోర్ట్ చేసే భారతీయ భాషల్లోనూ లభిస్తాయని తెలిపింది.

ప్రకృతి విపత్తుల సమయంలో ముందస్తుగానే ప్రజలకు సందేశాలు పంపి, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేలా చేసి ప్రాణ హాని తగ్గిస్తుందనే భావనతో ఈ వ్యవస్థను తీసుకొస్తున్నట్లు గూగుల్ పేర్కొంది.

What do you think?

విడాకులపై నవ్వుతూనే ఘాటు సమాధానం ఇచ్చిన స్వాతి

మళ్ళీ జత కట్టనున్న విజయ్ – రష్మిక. వీడీ 12..