in

మళ్ళీ జత కట్టనున్న విజయ్ – రష్మిక. వీడీ 12..

మళ్ళీ జత కట్టనున్న విజయ్ – రష్మిక. వీడీ 12..

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మంధాన మరో సారి కలిసి నటించబోతున్నారా..? అవుననే అంటున్నాయి చిత్ర వర్గాలు.

ప్రముఖ యంగ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి విజయ్ దేవరకొండ 12వ సినిమాను (VD12) తెరకెక్కిస్తున్నారన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రస్తుతం ఫామ్ లో ఉన్న హీరోయిన్ శ్రీలీల నటిస్తున్నారని ప్రకటనలు కూడా వచ్చాయి. అయితే గూంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్, భగవంత్ కేసరీ ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న శ్రీలీలను విజయ్ సినిమాలో నటించేందుకు మేకర్స్ సంప్రదించినప్పటికీ ఆమె కాల్షిట్లు అడ్జస్ట్ కాలేదట. దీంతో ఈ సినిమా నుంచి శ్రీలీల తప్పుకుందని సమాచారం. దీంతో మూవీ టీమ్ రష్మీకను సంప్రదించిందట.

విజయ్, రష్మీక కలిసి నటించిన గీతగోవిందం బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇక వారిద్దరూ నటించిన డియర్‌ కామ్రెడ్‌ ఆశించిన ఫలితం ఇవ్వలేకపోయినప్పటికీ వారి జంటకి ప్రేక్షకులలో ఫాలోయింగ్ ఇంకా ఎక్కువైంది.

కాగా రష్మిక ప్రస్తుతం పుష్ప2, యానిమల్, ధనుష్‌తో కొత్త సినిమా చేస్తోంది.

What do you think?

ముందస్తుగానే భూకంపాల అలర్ట్ ఇచ్చే గూగుల్ వ్యవస్థ

భోజనంలో బల్లి. 110 విద్యార్థులకు అస్వస్థత