in ,

రాజమౌళి పై చెలరేగిన ట్రోల్స్! కంగనా ఘాటు ట్వీట్.

బాలీవుడ్ భామ కంగనా రనౌత్ రాజమౌళిని ఏమైనా అంటే ఊరుకునేది లేదని, ఆయన వర్షంలోనూ కణకణ మండే అగ్ని లాంటి వారని ప్రశంసించారు. రాజమౌళి జాతీయవాదని, ఆయన ఒక యోగి అని కంగనా అభివర్ణించారు.

అసలు విషయం ఏంటంటే “ఆర్ఆర్ఆర్” సినిమా ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేయడంతో ఆ సినిమాకు చాలా అవార్డులు వచ్చాయి. ఎస్.ఎస్ రాజమౌళి న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్ సర్కిల్ అవార్డ్స్ లో “బెస్ట్ డైరెక్టర్” అవార్డు గెలుచుకోగా.. “నాటు నాటు” పాటకు గానూ కీరవాణి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కెటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగానే రాజమౌళి ప్రపంచం ప్రఖ్యాతి చెందిన దర్శకులు జేమ్స్ కామెరూన్, స్టీవెన్ స్పీల్‌బర్గ్ లను కలిశారు. హాలీవుడ్ లోని చాలా ఛానల్స్ కి ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఐతే అలా ఇచ్చిన ఇంటర్వ్యూలలో “ది న్యూయార్కకర్” మాగజైన్ తో రాజమౌళి ఒక సందర్భంలో మాట్లాడుతూ “మాది చాలా పెద్ద కుటుంబం. అందరూ మత విశ్వాసాలను నమ్ముతారు. నా బాల్యంలో హిందూ దేవతల కథలు చదువుతుంటే అనేక సందేహాలు వచ్చేవి. అవన్నీ నిజం కావేమోనని అనుకునేవాడిని. మా కుటుంబ సభ్యులు అనుసరించే ధార్మిక మార్గంలో నేనూ నడిచా. ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటం, తీర్థయాత్రలు చేయటం, కాషాయం ధరించి సన్యాసిలా జీవించా. కొందరు స్నేహితుల వల్ల క్రైస్తవ మతాన్ని కూడా అనుసరించా. బైబిల్ చదివా. చర్చికి వెళ్లా. ఇవన్నీ చూసిన తర్వాత ‘స్వలాభం కోసమే మతం’ అన్న విషయం అర్థమైంది.” అని అన్నారు.

ఈ మాటలలో చెడు అర్థాన్ని వెతికిన కొంత మంది సోషల్ మీడియాలో రాజమౌళి ట్రోల్ చేయడం మొదలపెట్టారు. ఐతే ఈ ట్రోల్స్ రాజమౌళి స్పందించలేదు కానీ బాలీవుడ్ భామ కంగనా రనౌత్ ఘాటుగా సమాధానం ఇచ్చారు.
“మరీ అంత అతిగా స్పందించాల్సిన అవసరం లేదు. దేవుడు ప్రతి చోటా ఉన్నాడు. మాటల కన్నా చేతలే కనిపించాలి. మేము అందరి కోసం సినిమాలు చేస్తాం. మాకు ఎవరి సాయం ఉండదు. మాకు మేమే సాయం చేసుకోవాలి. అండగా నిలవాలి. రాజమౌళి సరి ని ఎవరైనా ఏమైనా ఉంటే ఊరుకోను. ఆయన వర్షంలో మండే నిప్పు. ఆయన ఒక జాతీయవాది. యోగి. రాజమౌళిలాంటి వ్యక్తి మనకు ఉండటం మన అదృష్టం ” అంటూ కంగనా రాజమౌళిని అభివర్ణించారు.

“ఈ ప్రపంచం రాజమౌళిని వివాదాస్పద వ్యక్తిగా ముద్రవేస్తోంది ఎందుకు? ఆయన సృష్టించిన వివాదం ఏంటి? ‘బాహుబలి’తో మన ఖ్యాతిని పెంచడమా? దేశం గర్వించే ‘ఆర్ఆర్ఆర్’ తీయడమా? అంతర్జాతీయ వేదికల పై ధోతి ధరించడమా? చెప్పండి ” అంటూ ఘాటుగా ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.

What do you think?

ట్విట్టర్ తిప్పలు తప్పేదెప్పుడు?

కెప్టెన్ బెన్ స్టోక్స్ కాతాలో కొత్త రికార్డ్!