in ,

రాజకీయాల్లోకి అడుగు పెట్టనున్న అభిషేక్ బచ్చన్

రాజకీయాల్లోకి అడుగు పెట్టనున్న అభిషేక్ బచ్చన్

అభిషేక్ బచ్చన్ త్వరలో రాజకీయాల్లోకి అడుగు పెట్టనున్నారట. ఆయన తండ్రి పోటీ చేసిన స్థానం నుంచే అభిషేక్ కూడా పోటీ చేయనున్నారట.

సినీ తారలు రాజకీయాల్లోకి రావడం సర్వ సాధారణ విషయం. సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, అమితాబ్ బచ్చన్, తలపథి విజయ్, కమల్ హాసన్ ఇలా చాలా మంది పెద్ద హీరో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కొంత మంది చేదు అనుభవాలు ఎదుర్కొంటే కొందరు విజయం సాధించారు. అయితే ఇప్పుడు ఈ బాటలో బాలీవుడ్ స్టార్ హీరో, అమితాబ్ బచ్చన్ కొడుకు అభిషేక్ బచ్చన్ కూడా నడవబోతున్నారు.

ఆయన తండ్రి అమితాబ్ బచ్చన్ పోటీ చేసిన సమాజ్‌వాదీ పార్టీ తరఫున యూపీలోని ప్రయాగ్‌రాజ్ లోక్‌సభ స్థానం నుంచి అభిషేక్ పోటీ చేయనున్నారనే వార్త గట్టిగా వినిపిస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉండగా.. అభిషేక్ తల్లి జయా బచ్చన్ కూడా సమాజ్‌వాదీ పార్టీ తరఫున యూపీ నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు.

What do you think?

వ్యాపారం అభివృద్ధి చెందాలా? అయితే ఇది చదవండి

వివాదంలో మెగా హీరో సాయిధరమ్ తేజ్