in ,

‘రష్మీక ను నేను అలా అనలేదు’ – ఐశ్వర్యా రాజేష్

రష్మీక ను నేను అలా అనలేదు’ – ఐశ్వర్యా రాజేష్

 

‘వరల్డ్ ఫేమస్ లవర్’ , ‘టక్ జగదీష్’ , ‘రిపబ్లిక్’ లాంటి తెలుగు సినిమాలతో టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న నటి ఐశ్వర్యా రాజేష్ ఇటీవల రష్మీక మందాన పై చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గ మారాయి. దీంతో ఆమె ఓ మెట్టు దిగి స్పందించక తప్ప లేదు.

 

విషయం ఏంటంటే ఐశ్వర్యా రాజేష్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో “తెలుగులో ఎలాంటి పాత్రలు చేయాలని అనుకుంటున్నారు?” అని ఆమెను ప్రశ్నించగా.. ఆమె కొన్ని వివాదస్పదమైన వ్యాఖ్యలు చేశారు. “పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్ర నాకు ఇచ్చి ఉంటే రష్మిక కంటే బాగా చేసేదాన్ని” అంటూ ఆమె విమర్శలకు దారి తీసే వ్యాఖ్యలు చేసింది. ఈ మాటలు నెట్టింట వైరల్ గ మారడంతో రష్మిక అభిమానులు ఐశ్వర్యా రాజేష్ ను ఒక ఆట ఆడుకున్నారు.

 

దీంతో స్పందించిన ఐశ్వర్యా రాజేష్ తన వ్యాఖ్యలను తప్పుగ అర్థం చేసుకున్నారంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

 

“ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో తెలుగులో ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు? అని ప్రశ్నించగా.. అందుకు నేను.. నాకు టాలీవుడ్ అంటే చాలా ఇష్టం. మంచి పాత్రలు వస్తే కచ్చితంగా తెలుగులో కూడా మంచి సినిమాలు చేస్తానని అన్నాను. పుష్పలో శ్రీవల్లి లాంటి పాత్రలు నాకు బాగా సూటవుతాయి. అలాంటి రోల్స్ చేయడానికి ఇష్టపడతానని సమాధానమిచ్చాను. దురదృష్టవశాత్తూ నా వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకుని, రష్మిక పనితనాన్ని నేను కించపరిచినట్లు వార్తలు రాస్తున్నారు.

దీంతో అంతా గందరగోళంగా మారింది. ఈ సినిమాలో రష్మిక యాక్టింగ్ నాకు చాలా నచ్చింది. నా తోటి నటీనటుల పై నాకు అపారమైన గౌరవం ఉంది. నేను మామూలుగా మాట్లాడిన మాటలకు తప్పుడు ఉద్దేశ్యాలను జోడించి పుకార్లు వ్యాప్తి చేస్తున్నారు. ఇలా చేయడం ఇకనైనా ఆపేయండి” అంటూ ఐశ్వర్య రాజేశ్ తన ఇన్స్టాగ్రామ్లో ఓ నోట్ షేర్ చేశారు.

What do you think?

ఏపీ లో బీ ఆర్ ఎస్ కార్యాలయం ప్రారంభం

ఆర్బీఐ సంచలన ప్రకటన. ఇక రూ.2 వేల నోట్లు చెల్లవు!