in ,

నితీష్‌ తివారి రామాయణంలో సీతగా సాయి పల్లవి?

నితీష్‌ తివారి రామాయణంలో సీతగా సాయి పల్లవి?

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నితీష్‌ తివారి రామాయణం తెరకెక్కించబోతున్నట్లు ఇతవరుకే తెలిపారు. అయితే తాజాగా ఈ సినిమాలో సీతగా సాయి పల్లవి నటించబోతున్నారని కొన్ని వార్తలు వస్తున్నాయి.

రణబీర్‌కపూర్‌ రాముడిగా, అలియాభట్‌ సీతగా రామాయణం తెరకెక్కబోతన్నట్లు గతంలో నితీష్‌ తివారి తెలిపారు. ఈ సినిమాను అల్లు అరవింద్‌, మధు మంతెన భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు. అయితే తాజాగా అలియాభట్‌ ఈ సినిమాలో నుంచి తప్పుకుందని వార్తలు వస్తున్నాయి. ఆమె ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమాకు డేట్లు సర్దుబాటు చేయలేకపోయారని.. దీంతో అలియా స్థానంలో సాయిపల్లవిని హీరోయిన్‌గా ఎంపిక చేశారని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

అయితే ఈ వార్త ఎంత వరకు నిజమో ఇంకా తెలీదు కానీ, సాయి పల్లవి అభిమానుల ఆనందానికి మాత్రం అవదులు లేకుండా పోయాయి.

What do you think?

ఇక నుంచి ట్విట్టర్‌ లో కూడా ఉద్యోగాల వేట.. ట్విట్టర్‌ కొత్త ఫీచర్

సూర్యుడిపై ప్రయోగానికి సిద్దం అవుతోన్న ఇస్రో. సెప్టెంబరు 2న..