in ,

సిని’మా హిట్’ ఫార్ములా ఇదేనా….?

సిని’మా హిట్’ ఫార్ములా ఇదేనా?

” బాలీవుడ్ లో బడా బాద్ షా లయిన ఖాన్ త్రయం హిట్ చూసి చాల సంవత్సరాలయింది. పారుఖ్ ప్రణయకావ్యాలు, అమీర్ హాలీవుడ్ స్టైల్, సల్మాన్ మాస్ మసాలా ఓవర్ గ్లామర్ డోస్, హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ ఇలా ఒకటేమిటి అది ఇది అనే తేడా లేకుండా దాదాపుగా అన్ని పెవిలియన్ బాట పడుతున్నాయి. ఈ సంవత్సరం బాలీవుడ్ గ్రాఫ్ చూస్తే ఒకటి అరా తప్ప చెప్పుకో తగ్గ హిట్స్ పడలేదు. ”

సీనియర్స్ అండ్ జూనియర్స్ అనే తేడా లేకుండా హిందీ సినిమా కు మళ్ళీ మంచి రోజులొస్తాయి అని బాలీవుడ్ ఇండస్ట్రీ కలలు కంటుంది. మరి నిజంగా బాలీవుడ్ అంత గడ్డు సమస్యను ఎదుర్కొంటుందా అనేది మొదటి సందేహం. సినిమాల హిట్ శాతం బాగా తగ్గుముఖం పట్టడమే ఒక ఇండస్ట్రీ కి చెడ్డరోజులొచ్చాయి. అనేది నిజం కాకపోవచ్చు.

తెలుగు ఇండస్ట్రీ కూడా దాదాపు పదిహేడు సంవత్సరాల క్రితం అనుకుంటా సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది. ఆ సమయం లో తెలుగు హీరోలంతా ఆక్టివ్ గ ఉన్నారు. మెగాస్టార్. నాగ్, బాలయ్య, వెంకీ వీరితో పాటు పవర్ స్టార్ మహేష్ బాబు, జూనియర్ ఎన్ టి ఆర్ తదితరులు సినిమాలు చేస్తున్నారు. రెండేళ్లు పాటు స్టార్లకు కూడా పెద్దగా విజయాలు రాలేదు. సినిమాలు అలా వచ్చి సో సో గ ఇలా వెళ్లిపోయేవి. అప్పట్లో ఆనంద్ వంటి చిన్న సినిమాలనే హిట్ ల గా పరిగణించారంటే పరిస్థితి ఊహించొచ్చు.

సరిగ్గా అదే సమయం లో మన తెలుగు నాట తమిళ అనువాద చిత్రాలు విజయ కేతనాన్ని ఎగురవేశాయి. అపరిచితుడు, గజని, చంద్రముఖి. పందెంకోడి, శివపుత్రుడు ఇలా…వాటి ఊపు ముందు తెలుగు హీరో ల రొటీన్ ఫార్ములా సినిమాలు నిలవలేక పోయాయి. తెలుగు ప్రజలు తమిళ ప్రయోగాలకు ముగ్ధులయ్యారు.

ఈ సందర్భం లోనే తమిళ హీరోలకు తెలుగు నాట స్టాండర్డ్ మార్కెట్ ప్రారంభం అయ్యింది. వారి సినిమాలు ఇప్పటికి కొనసాగుతున్నాయంటే ఆలా రెండువేలు నాలుగు, రెండువేల అయిదు సంవత్సరాలలో తమిళ హీరోలకు తెలుగునాట బేస్ పడింది. తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ మన తెలుగు ఇండస్ట్రీ గాడిన పడింది. తమిళులకు ధీటుగా సినిమాలు చేస్తూ పరభాషలకు రీమేక్ చేసుకో తగ్గ కథలను అందించారు.

ఆలా అలా ఇప్పుడు తెలుగు సినిమాలే పాన్ ఇండియా సినిమాలయ్యి
దుమ్ము రేపుతున్నాయి.

సరిగ్గా ఇపుడు బాలీవుడ్ పరిస్థితి కూడా దాదాపు పదిహేడేళ్ల ముందు మనం ఎదుర్కున్న పరిస్థితే. బాలీవుడ్ లో బడా బాద్ షా లయిన ఖాన్ త్రయం హిట్ చూసి చాల సంవత్సరాలయింది. అమిర్ హాలీవుడ్ స్టైల్. సల్మాన్ మాస్ మసాలా ఓవర్ గ్లామర్ డోస్, హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ ఇలా ఒకటేమిటి అది ఇది అనే తేడా లేకుండా దాదాపుగా అన్ని పెవిలియన్ బాట పడుతున్నాయి. ఈ సంవత్సరం బాలీవుడ్ గ్రాప్ చూస్తే ఒకటి అరా తప్ప చెప్పుకో తగ్గ హిట్స్ పడలేదు.

ఇక ఈమధ్య విడుదలయిన హాలీవుడ్ రీమేక్ లాల్ సింగ్ చద్దా : కూడా చతికిల పడి బాలీవుడ్ లబో దిబో మంటుంది. ఇలా బాలీవుడ్ సినీ ప్రేమికులంతా తీరని నిస్పృహలో మళ్ళీ బాలీవుడ్ కు మంచి రోజులొస్తాయని ఆశగా ఎదురుచూస్తున్నారు.ఈ పరిస్థితుల్లో బాలీవుడ్ హీరోలంతా రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. కానీ ఇది సాధ్యమా? ఇదే పరిస్కారమా ?

అయితే సినిమా విశ్లేషకులయినా, సినీ పండితులయినా, సినిమా రూపకర్తలయినా ముఖ్యం గా గమనించాల్సింది ఏంటంటే మారిన సినీ ప్రేక్షకుల అభిరుచి, కరోనా పాండమిక్ లో ప్రపంచసినీ లోకాన్ని అంత చుట్టి వచ్చేసారు సినీ ‘మా’ జనం. ఓ టి టి ప్లాట్ ఫామ్ లు వచ్చాక ప్రపంచ సినీ లోకం అంతా మొబైల్ లో ఇమిడి పోయింది. అలాంటి సినిమాలన్నీ చూసాక బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఏ భారతీయ భాషలో నయినా వచ్చే సినిమాల పట్ల పెదవి విరుపులు సహజం గానే ఎక్కువయ్యాయి. ఇది కూడా సినిమాలు వరుసగా ఫెయిల్యూర్ అవటానికి ప్రధాన కారణం.
సో ప్రేక్షకులను తక్కువ అంచనా వేయడం మానేసి మారిన పరిస్థితులను గుర్తించి కథ, కథనం, రూపకల్పనలో మరింత పదును పెడితే బావుంటుందనేది
మా సిని ‘మా హిట్’ ఫార్ములా.

What do you think?

సినీ రంగ ప్రముఖుల పై బి జె పి గురి- మాస్టర్ ప్లాన్

గుంతలు కాదు.. ప్రాణ గండాలు..ఇవి రాకాసి రహ”దారుణాలు