సినీ రంగ ప్రముఖుల పై బి జె పి గురి- మాస్టర్ ప్లాన్
( కథానాయకులపై కన్నేసిన కమలనాథులు )
తెలుగు రాష్ట్రాలలో బలపడాలన్న బి జె పి తెలుగు నాట సినిమా క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని కథానాయకులపై కన్నేసిన కమలనాథులు.
ఈ మధ్య సినీ పరిశ్రమకు, బి జె పి కి సత్సంబంధాలు బాగా మెరుగు పడ్డాయి. జనాదరణ ఉన్న టాలీవుడ్ హీరోలపై బి జె పి కన్ను పడింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యం గ బి జె పి పాములు కదుపుతుంది. ఆ దిశగా కార్యాచరణను సంసిద్ధం చేస్తుంది.
తెలంగాణాలో అధికారంలో కి రావడానికి కలిసొచ్చే ప్రతి అవకాశాన్ని అంది పుచ్చుకునే భాగంగానే ఈ మాస్టర్ ప్లాన్ వేస్తుంది.
రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని స్టార్ కాంపెయిన్ ల లో సినీ ప్రముఖులను వాడుకునే ఆలోచనలో బిజెపి.
రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో సత్తా చాటాలని ఈ కొత్త ఆక్షన్ ప్లాన్ ని సిద్ధం చేస్తుంది.
గత కొద్ది రోజులుగా రాష్ట్రాలలో బి జె పి అనుసరిస్తున్న విధానంతో పాటు పలువురు ప్రముఖులు కొత్తగా కమలం తీర్థం పుచ్చుకోవడం ఈ వాదనకు మరింత బలాన్ని చేకూరుస్తుంది.
ఇదే సమయంలో ఆ పార్టీ జాతీయ నాయకులు పలువురు జూనియర్ ఎన్ టి ఆర్, నితిన్ వంటి సినీ ప్రముఖులను కలిసారు. వారి పైన ఉండే అభిమానులు కానీ, సానుభూతి పరులు కానీ పార్టీ వైపు మొగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి బి జె పి ఈ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది.