in

గుంతలు కాదు.. ప్రాణ గండాలు..ఇవి రాకాసి రహ”దారుణాలు

గుంతలు కాదు.. ప్రాణ గండాలు..ఇవి రాకాసి రహ”దారుణాలు

రహదారులు అభివృద్ధికి పట్టుకొమ్మలు అంటారు. అలాంటి రోడ్ లు రాష్ట్రము లో పూర్తిగా పాడై పోయాయి. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థకు పట్టుకొమ్మలాంటి రహదారులు అద్వాన్నం గ మారాయి. ఎక్కడ చూసినా అడుగేస్తే మడుగే అనే పరిస్థితి.

పల్లె సీమలంటే పచ్చని చెట్లు. చల్లని గాలులు, సందె వేళ గోధూళి అక్కడికి వెళ్లాలంటే నల్లని తాచుపాములాంటి రోడ్లు. ఇవన్నీ ఒకప్పటి మాటలు మరి ఇపుడో, పల్లెలకు వెళ్లే రోడ్లపై అడుగడుగునా గుంతలు. వాటిపై వెళ్తే విరిగే నడుములు. పట్టపగలు వెళ్లాలంటే చుక్కలు కనిపించే పరిస్థితులు. అసలు రోడ్డుందా ? అనే దుస్థితి. ఈ రోడ్ల పై ఇక రాత్రిపూట గుడ్డి దీపాల వెలుగులో వెళ్ళామంటే గమ్యస్థానం ఆసుపత్రే. ఇది ఆంధ్రప్రదేశ్ లో ని రోడ్ల పరిస్థితి. ఎటు చుసిన అడుగుకో గుంతపడి.. రాళ్లు తేలి అత్యంత ప్రమాదకరంగా మారిన ఆ దారుల్లో కొంతదూరం వెళ్తేనే ఒళ్ళు హూనమవుతుంది. ఏ కాస్త ఆదమరచిన గోతుల్లో పడి కాళ్ళు చేతులు విరుగుతున్నై. ఇక గర్భిణీలు ఆసుపత్రికెళ్లాలంటే ఏ క్షణం ఏమవుతుందోనని బయపడాల్సిందే. నరకానికి నకళ్ళులా మారిన ఈ రహదారులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లో 25 జిల్లాలలో మచ్చుకు జిల్లాకో రహదారిని తీసుకుని చూస్తే వాటి పరిస్థితి అత్యంత దయనీయం గ ఉంది. ఇంచు మించుగా 200 కిలో మీటర్ లలో 7000 గుంతల వరకు కనిపిస్తాయి. వాటిలో అయిదు నుండి పది మీటర్ల విస్తీర్ణం లో నే ఉన్నాయి.
ఆరోగ్య పరంగానే కాదు ఆర్ధికం గ కూడా ఆంధ్రుల జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్న ఈ రహ “దారుణాల” పరిస్థితి పై ఈ కథనం.

కొన్నేళ్లుగా కనీస నిర్వహణ లేక, మరమ్మతుల కు నోచక, గుంతల నైనా పూడ్చక పోవటం తో ఆంధ్రప్రదేశ్ లోని రోడ్లన్నీ అత్యంత ప్రమాదకరంగా, భయానకంగా మారాయి. వర్షం పడితే ఇక రోడ్లన్నీ చెరువులే. ఈ రోడ్ల పై వెళ్లే ఆటోలు, ఇతర వాహనాలు అతితక్కువ సమయం లోనే దెబ్బతింటుండటం తో వాళ్లకు వచ్చే ఆదాయం లో ఎక్కువమొత్తం మరమ్మత్తులకే పోతుంది. ఇది ఒక రైతన్న నోటి మాట ..

“పల్లెలనుండి వ్యవసాయ ఉత్పత్తులను తరలించాలన్నా, సాగుకి అవసరమైన ఎరువులను తెచ్చుకోవాలన్నా, ఈ అద్వాన్నపు రోడ్ల మూలం గ ఖర్చు తడిసి మోపుడవుతుంది.” ఇది ఒక ఆటో వాలా ఆవేదన…

రోజూ వ్యవసాయకూలీలను ఆటో లో పొలం తీసుకెళ్తుంటా రొడ్ల పై రాళ్లు పైకే లేచి ఉండడం తో టైర్లు పాడవుతున్నాయి. ప్రతి ఆరు నెలలకు ఒకసారి కొత్త టైర్ లు మార్చాల్సి వచ్చి ఖర్చు పెరుగుతుంది. గోతులు ఎక్కువగా ఉండడంతో ఆటో దెబ్బతింటుంది.

ఒక పల్లె కాదు, ఒక ఊరూ కాదు రాష్ట్రం లో ఎక్కడ చూసినా ఇదే స్థితి.పట్నం నుండి పల్లె వరకు రోడ్లన్నీ దుర్భర స్థితి కి చేరాయి. ఈ దారులకు దండం మహా ప్రభో కనికరించండి అంటూ ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మూడేళ్ళుగా రహదారిపై తట్టడు తారు కూడా పోయలేదు ఎక్సలేటర్ ఎంత రైజ్ చేసినా స్కిడ్ అవటం ఖాయం. బైకర్ లు, ఆటో వాలా లు లబో దిబో మంటున్నారు.

రోడ్ ప్రమాదాల్లో అనేకమంది గాయాలు పాలు కాగా, పలువురు మృతువాత పడ్డారు.
ఇవి భారీ వర్షాలకు రోడ్ల పై పడిన గోతులా.. గుంతలను కవర్ చేసేందుకు వేసిన రోడ్డులా? రొడ్ల పై గుంతలున్నాయా, గుంతల మధ్య రోడ్లున్నాయి అన్న అనుమానం రాక మానదు. పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులు ఎన్ని విజ్ఞప్తులు చేస్తున్నా ప్రభుత్వాధికారులు స్పందన కరువైంది. ఇవన్నీ చూస్తే రొడ్ల కష్టాలు కొనసాగక తప్పవని ప్రజలు నైరాశ్యం లో మునిగిపోయారు.

 

ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు ఘోరమైన స్థితిలో వున్నాయి. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి.

> ఓమాదిరి గుంతలు పడినప్పుడే బాగుచేయించకపోవడం వల్ల క్రమంగా విస్తరించి రోడ్లు మొత్తం పాడయ్యాయి.
> నిర్మాణ దశలోనే సరైన పరిశీలన, పర్యవేక్షణ లేకపోవడంతో ‘ ఇష్టా రాజ్యం భరతుడి పట్టం ‘ సామెతగా నాణ్యత లేకుండా నిర్మించేస్తారు.
> ఓ రోడ్డు నిర్మిస్తున్నారు అంటే, అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు, ప్రజలు కూడా పరిశీలించడం అవసరం. ప్రజలు చైతన్యవంతులైతే నాసిరకం నిర్మాణాలు ఆగిపోతాయి.
> ఒకప్పుడు రహదార్లు భవనాల శాఖలో మైలు కూలీలు వుండేవారు. వాళ్ళు రోడ్లపై వర్షపు నీరు నిల్వకుండా మార్జిన్లు వాలుగా తవ్వేవారు. పొదుపు చర్యల పేరుతో రెండు దశాబ్దాల క్రితమే వారిని సాగనంపింది. దీనివల్ల వారు నిరుద్యోగులయ్యారు. రోడ్లు అనాధలయ్యాయి. ఫలితంగా ‘సంచి లాభం చిల్లు కూడదీసింది’.
> ప్రభుత్వం సంక్షేమ పథకాలపై పెట్టిన దృష్టి రోడ్లపై పెట్టలేదు. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలు అయ్యాయి. రకరకాల రూపేణా పన్నులు చెల్లిస్తున్నా, జవాబుదారీతనం కొరవడింది.
> కొన్ని దేశాల మాదిరిగా రోడ్ల నిర్వహణ బాగోకపోతే, ప్రమాద బాధితులకు పరిహారం చెల్లించేపరిస్తితి వస్తే మేలు.

రోడ్లు అధ్వాన్నమే. ఇప్పుడే కాదు గత ప్రభుత్వ హయాంలో కూడా ఇంతే. ముఖ్యంగా డెల్టా ఏరియా లో మరీ అధ్వన్నాం. రోడ్డు వేసినా అది 3 ఏళ్ళు కూడా ఉండదు. చివరకు హై వేల మీద కూడా గోతులు. చివరకు సిమెంటు రోడ్లు కూడా బీటలు తీస్తాయి. 5 ఏళ్ల కే కుంగి పోతాయి, ఎత్తు పల్లాలుగా మారి పోతాయి.

రోడ్లు బాగుంటే సమయం అదా, ఉత్పత్తి రంగంలో రాష్ట్రము ఎంతో అభివ్రుద్ధి సాదిస్తుంది, పెట్రోల్ ఉత్పత్తుల ఖర్చు ఆదా అవుతుంది వాహనాలు మైంటెనన్ను ఖర్చులు ఆదాఅవుతాయి. మనం ఉత్పత్తి చేసిన వస్తువులు దేశీయ/అంతర్జాతీయ అంగళ్ళకి త్వరగా చేరతాయి. కాని వీటి ప్రయోజనాలు వెంటనే తెలియవు. నెలనెల పడే బటన్ వ్యవహారం కాదు కాబట్టి మనం ఆ రోడ్లు మీద వెళ్ళినప్పుడు తిట్టుకొని అకౌంట్లలో డబ్బులుపడగానే ఆ సంగతి మర్చిపోతాం.

రోడ్ల నాణ్యత, ప్రభుత్వాల అలసత్వం తో పాటు మరో ముఖ్య కారణం ఉంది. అది నేల స్వభావం.ఇది నల్లమట్టి నేల. మట్టి లో గట్టి తనం ఉండదు. వర్షా కాలం మరింత ఎక్కువ గా రోడ్లు పాడువుతాయి. గోతులు పడతాయి అయితే ప్రభుత్వాలు శ్రద్ద పెట్టి, సరైన టెక్నాలజీ తో రోడ్లు నిర్మిస్తే అవి బాగుంటాయి. ముఖ్యం గా మెయింటేనేన్స్ బాగుండాలి. చిన్న గొయ్యి పడగానే పూడ్చి వేస్తే అది పెద్దది. కాకుండా రోడ్డు బాగుంటుంది.

సంక్షేమ కార్యక్రమా లతో పాటు, రోడ్లు తదితర విషయాలలో కూడా ప్రభుత్వం శ్రద్ధ వహించాలని కోరుకుందాం. ఇవి రాకాసి రోడ్ల రాష్ట్ర రహ”దారుణాలు “

What do you think?

సిని’మా హిట్’ ఫార్ములా ఇదేనా….?

కనుమరుగవుతున్న తెలుగు నాటకం… సురభి.