in

“వాళ్లు చెప్పినట్టు చేయమన్నారు” – కాస్టింగ్ కౌచ్ పై నయన తార

తమిళ లేడీ సూపర్స్టార్ నయన తార ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెళ్లి తరువాత కూడా వరుస సినిమాలతో దూసుకుపోతున్న నయన్ తన కెరీర్ తొలినాళ్లలో తాను కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొన్నానని చెప్పారు.
చాలా మంది నటీనటులు కాస్టింగ్ కౌచ్ పై సోషల్ మీడియా వేదికగా నోరు విప్పి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారన్న విషయం అందరికీ తెలిసిందే.అయితే ఇప్పుడు బిగ్ స్టార్ నయన్ కూడా కాస్టింగ్ కౌచ్ పై తన గళాన్ని విప్పారు. ఆమె ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ తొలి నాళ్ళలో ఒక పెద్ద ప్రాజెక్ట్ లో మంచి అవకాశం వచ్చిందని.. కానీ అక్కడ వారికి నచ్చినట్టు ఉండాలి, వాళ్లు అడిగింది చేయాలి అంటూ కోరారని నయన్ తెలిపారు.
కానీ తన టాలెంట్ పై నమ్మకంతో నయన్ వాటిని సున్నితంగా తిరస్కరించినట్లు వివరించారు.
ఇక గత ఏడాది “కనెక్ట్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రశంసలు అందుకున్న నయన్, ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ నటిస్తున్న ” జవాన్” సినీమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

What do you think?

అన్ స్టాపబుల్ (unstoppable) షోకి హాజరైన పవన్ తన మూడు పెళ్లిళ్లపై ఘాటుగా సమాధనం ఇచ్చారు

ఆర్మీ రిక్రూట్మెంట్లో మరో మార్పు, త్వరలో నోటిఫికేషన్