in

ఆర్మీ రిక్రూట్మెంట్లో మరో మార్పు, త్వరలో నోటిఫికేషన్

ఇండియన్ ఆర్మీలో ధరఖాస్తు కోసం కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్ కింద నిర్వహిస్తున్న అగ్నివీరుల నియామక ప్రక్రియలో ఆర్మీ ఇప్పుడు ఒక కీలక మార్పు చేసింది. ఈ విషయానికి సంబంధించిన ఒక నోటిఫికేషన్ కూడా త్వరలో రాబోతున్నట్టు తెలుస్తుంది.

వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం ఆగ్నివీరుల ఎంపికలో తొలుత ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్టు నిర్వహిస్తున్నారు. వీటిలో అర్హత సాధించిన వారు ఆ తరువాత సీఈఈకి హాజరు కావాల్సి ఉంటుంది. ఐతే ఇక నుంచి ఆర్మీలో చేరాలనుకునే వారికి ఆన్లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేన్ (CEE) ముందు నిర్వహించాలని, ఆ తర్వాతే ఫిట్నెస్, మెడికల్ టెస్టులు నిర్వహించాలని ఆర్మీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఈ విషయానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.
ఇలా ఆన్లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేన్ (CEE) ను ముందు నిర్వహించడం ద్వారా రిక్రూట్మెంట్లో భారీ రద్దీలను తగ్గించేందుకు వీలవుతుంది.

దేశవ్యాప్తంగా 200 కేంద్రాల్లో ఏప్రిల్ లో తొలి విడత సీసీఈ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తుంది. 2023-24 జరగబోయే రిక్రూట్మెంట్లో ఆర్మీలో చేరబోయే 40 వేల మందికి ఈ ప్రక్రియ వర్తించనుంది.

What do you think?

“వాళ్లు చెప్పినట్టు చేయమన్నారు” – కాస్టింగ్ కౌచ్ పై నయన తార

అరుదైన రికార్డును సాధించిన మహ్మద్‌ షమీ.