in ,

స్మృతి “పదం” అల్లూరి సినిమాలో “శ్రీ శ్రీ” త(ఒ)ప్పు

అల్లూరి సినిమాలో “శ్రీ శ్రీ” త(ఒ)ప్పు

మన్యం వీరుడు “అల్లూరి సీతారామరాజు” తాలూకు పోరాట పటిమను అద్భుతంగా దృశ్యబద్దం చేసిన సినిమా అల్లూరి సీతారామరాజు. నటశేఖర కృష్ణ కథానాయకుడుగా నటించిన ఈ సినిమా విజయం వెనుక ఆ చిత్రంలో శ్రీ శ్రీ రాసిన “తెలుగు వీర లేవరా” పాట కూడా ఉంది. ఈ పాటలోని విప్లవాత్మక పదబంధాలు నటుడు కృష్ణలోని నటనకు ఎంతో ఉద్దీపన గా నిలిచాయి.

ఈ పాట ద్వారానే విప్లవ యోధుడు అల్లూరి చరిత్ర ప్రజలకు బాగా తెలిసింది. ఈ గేయంలో “ప్రతి మనిషి తొడలు గొట్టి శృంఖలాలు పగుల గొట్టి సింహాలై గర్జించాలి” అనే పదబంధాలు  శ్రోతలకు చైతన్య స్ఫూర్తిని కలిగిస్తాయి. అయితే…ఈ పాటలో ఓ చోట తప్పు దొర్లిందని శ్రీశ్రీ అన్నారట.అదేమిటంటే..

మనిషి ఏకవచనం కాబట్టి సింహంలా గర్జించాలని నేను రాశాను. పాట రికార్డులో మాత్రం “సింహాలై” అని బహువచనంలో రికార్డు అయింది” అన్నారట. ఆ తర్వాత ఆ తప్పును ఆయన మరో విధంగా సరిదిద్దుతూ “ప్రతి మనిషి సింహాల సమూహంలా పోరాడాలని చెప్పడంలో తప్పు లేదు కదా అని సమర్ధించారట.

దీనిని బట్టి తప్పును ఒప్పు గా మెప్పించగల కవి శ్రీశ్రీ అనడం తప్పు కాదేమో. అంతేకాదు ఈ తెలుగు పాటకు తొలిసారిగా జాతీయ పురస్కారం రావడం విశేషం. అది కవి శ్రీశ్రీ కి, ఆంధ్రుడైన స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరికి,ఆ చిత్రనిర్మాతకు దక్కిన అరుదైన జా’తీయ’ని గౌరవంగా చెప్పుకోవచ్చు.

What do you think?

సిరివెన్నెల పాట వెనుక రహస్యం ఏంటి?

టాప్ 5 నెట్ ఫ్లిక్స్ సినిమాలు పార్ట్ #1