in ,

మాటల దగ్గరే ఆగిపోయిన స్టార్ హీరోల సినిమాలు.

సినిమాలు

మాటల దగ్గరే ఆగిపోయిన స్టార్ హీరోల సినిమాలు:

 

ప్రతి సంవత్సరం వేలల్లో సినిమాలు విడుదలవుతుంటాయి.

కానీ ప్రతి ఒక్క సినిమా కథ ,కథనం లాంటి ఎన్నో విషయాల గురించి హీరోలు,దర్శకులు మొదటిగా చర్చించుకున్న తరువాతే ఆ సినిమా పట్టాలెక్కుతుంది. ఏది కుదరకపోయినా ఆ సినిమా మధ్యలోనే ఆగిపోతుంది.

అలా మధ్యలో లేదా చర్చల దగ్గరో ఆగిపోయిన కొన్ని సినిమాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

  1. సత్యాగ్రహి

ఎల్లపుడూ విభిన్నమైన నటనతో ప్రేక్షకులను అలరించే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  ప్రతి సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తుంటారు. 2006లో జానీ సినిమా తరువాత మరో సారి దర్శకుడిగా మారి సత్యాగ్రహి అనే సినిమాను తెరకెక్కిద్ధామనుకున్నారు పవన్ కళ్యాణ్. దీనికి ఏ.ఎమ్ రత్నం నిర్మాతగా,ఏ.అర్.రెహమాన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారని అధికారికంగా కూడా ప్రకటించారు అయితే అనుకోని కారణాల వల్ల ఆ సినిమా పట్టలెక్కక ముందే ఆగిపోయింది.

 

2.నర్తనశాల

సీనియర్ ఎన్.టి.అర్ గారు,సావిత్రి గారు ప్రధాన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరించడంతో పాటు మన పురాణాలను అర్థమయ్యేలా చెప్పిన సినిమా నర్తనసాల. ఈ సినిమాను బారి తారాగణంతో తానే దర్శకుడిగా వ్యవహరిస్తూ మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువద్దామని బాలకృష్ణ గారు అనుకున్నారు. కానీ అనుకోని విధంగా సౌందర్యగారు చనిపోవడంతో ఈ సినిమా చిత్రీకరణ మొదలవ్వక ముందే ఆగిపోయింది.

 

3.వినాలని వుంది

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా తెరకెక్కించబోయారంటే నమ్ముతారా…?. వింటుంటేనే కలయక విచిత్రంగా ఉంది కదూ, కానీ ఇది నిజమేనండి. వినాలని వుంది అనే సినిమాలో ఊర్మిళ హీరోయిన్గా,సి.అశ్వినీ దత్ నిర్మిమిస్తున్నారని అధికారికంగా ప్రకటించడంతో పాటు ఒక పాటను కూడా విడుదల చేశారు. అయితే బారి అంచనాలతో ఎదురుచూసిన ఈ సినిమా అనుకోని కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయింది.

 

4.ప్రిన్స్ ఆఫ్ పీస్

పుష్పక విమానం,ఆదిత్య 369,మైఖెల్ మదన కామరాజు లాంటి ఎన్నో వినూత్నమైన సినిమాలను అందించిన సింగీతం శ్రీనివాసరావు గారు 2009లో పవన్ కళ్యాణ్ హీరోగా “ప్రిన్స్ ఆఫ్ పీస్ ” అనే సినిమాను తెరకెక్కించబోతున్నారని అధికారికంగా ప్రకటించారు. ప్రదేశాలు వెతకడంలో బాగంగా జెరూసలేం,బెత్లెహాం లాంటి కొన్ని ప్రదేశాలకు కూడా వెళ్ళి వచ్చారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పట్టలెక్కలేదు.

 

5.మహేష్ బాబు,నాగార్జున మల్టీ స్టారర్

నవాబ్ సినిమా తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు,కింగ్ నాగార్జున ప్రధాన పాత్రల్లో ఐశ్వర్య రాయ్ హీరోయిన్గా ఒక సినిమాను తెరకెక్కించబోతున్నామని మనిరత్నం గారు ప్రకటించారు. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ సినిమా మాటల దగ్గరే ఆగిపోయింది.

What do you think?

ఐఆర్సిటిసి కొత్త నిభందనలు.ఇక ట్రైన్ లో బుకింగ్ కష్టమే!

కె.విశ్వనాద్

కె.విశ్వనాథ్ కథల వెనుక రహస్యం ఏంటి?