in ,

జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ (పుష్ప)

జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ (పుష్ప)

2021 ఏడాదికి గానూ కేంద్ర ప్రభుత్వం 69వ జాతీయ ఉత్తమ అవార్డులను ప్రకటించింది. ఇందులో పుష్ప -1 సినిమాలో ఆయన అద్భుతమైన నటనకు గానూ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా నిలిచారు. ఈ అవార్డు అందుకున్న తొలి తెలుగు నటుడిగా చరిత్ర సృష్టించారు. ఈ కేటగిరీ రేసులో ఆర్ఆర్ఆర్ లో నటించిన తారక్, రామ్ చరణ్ సహా సూర్య (జై భీం), జోజు జార్జి (నాయట్టు) ఉన్నప్పటికీ అల్లు అర్జున్ నే ఈ అవార్డు వరించడం విశేషం.

ఇక తెలుగు విభాగంలో ఉత్తమ తెలుగు చిత్రంగా ‘ఉప్పెన’ అవార్డు దక్కించుకోగా.. ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా దేవీశ్రీ ప్రసాద్ (పుష్ఫ), బెస్ట్ బీజీఎం కేటగిరీలో కీరవాణి, బెస్ట్ కొరియోగ్రఫర్ గా ప్రేమ్ రక్షి నిలిచారు(నాటు నాటు).

What do you think?

చంద్రయాన్‌-3 మిషన్‌ విజయవంతం! జీవితం ధన్యమైందన్న ప్రధాని మోదీ

యూట్యూబ్ వీడియో చూసి భార్యకు ప్రసవం చేసిన భర్త