in

చంద్రయాన్‌-3 మిషన్‌ విజయవంతం! జీవితం ధన్యమైందన్న ప్రధాని మోదీ

చంద్రయాన్‌-3 మిషన్‌ విజయవంతం! జీవితం ధన్యమైందన్న ప్రధాని మోదీ

ఇస్రో తలపెట్టిన చంద్రయాన్‌-3 మిషన్‌ సక్సెస్ అయ్యింది. జాబిల్లిపై ఇప్పటివరకు ఏ దేశం దిగని దక్షిణ ధ్రువంపై విక్రమ్‌ ల్యాండర్‌ను విజయవంతంగా దింపి చరిత్ర సృష్టించింది. సా. 5.44 గంటలకు ల్యాండింగ్ మొదలవ్వగా సా.6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా చందమామను తాకింది.

ఇక నేటి నుంచి 14 రోజుల పాటు జాబిల్లిపై రోవర్‌ పరిశోధనలు జరపనుంది. మరో వైపు దేశం నలుమూలల నుంచి చంద్రయాన్‌ – 3 సక్సెస్‌ పై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ప్రధాని మోదీ కూడా చంద్రయాన్‌-3 ఘన విజయం సాధించడం పై స్పందిస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. ” నా జీవితం ధన్యమైంది. నేను బ్రిక్స్‌ సమావేశాల్లో ఉన్నప్పటికీ నా మనసంతా చంద్రయాన్‌ – 3 పైనే ఉంది. ఈ గెలుపు దేశం గర్వించే మహోన్నత ఘట్టం. చంద్రయాన్‌ -3 బృందం, ఇస్రో శాస్త్రవేత్తలకు నా అభినందనలు. ఈ క్షణం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూశాను.’ అని మోదీ అన్నారు.

What do you think?

అక్కడ ప్రారంభమయిన ‘సలార్’ అడ్వాన్స్ బుకింగ్స్

జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ (పుష్ప)