in ,

కళ్యాణ్ రామ్ “అమిగోస్” సినిమా రివ్యూ

అమిగోస్:

నటీనటులు : కళ్యాణ్ రామ్, ఆషికా రంగనాథ్, బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు
దర్శకత్వం : రాజేంద్ర రెడ్డీ
సంగీతం: జిబ్రాన్
నిర్మాతలు: వై.రవిశంకర్, నవీన్ యెర్నేని ( మైత్రీ మూవీ మేకర్స్)

చాలా కాలంగా సరైన సినిమాలు లేక సతమతమైన నందమూరి కళ్యాణ్ రామ్ గత ఏడాది “బింబిశార” తో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టారు. ఇప్పుడు ఆ సక్సెస్ అలాగే కొనసాగించాలని ఆశిస్తూ కొత్త కాన్సెప్ట్ ఉన్న “అమిగోస్” సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉండడంతో ప్రేక్షకులలో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. అలా ఇటు భారీ అంచనాల మధ్య , అటు బోలెడు ఆశల మధ్య విడుదలైన

“అమిగోస్” సినిమా ఎలా ఉందో, ఎంత మేరకు ప్రేక్షకులను మెప్పించిందో చూద్దాం.
కథ : హైదరాబాద్ కు చెందిన సిద్దార్థ్ (కళ్యాణ్ రామ్) ఒక వ్యాపారవేత్త. సిద్దార్థ్ కు ఆర్జేగా పనిచేసే ఇషిక (ఆషికా రంగనాథ్) తో ప్రేమలో పడతాడు. ఇషికను వప్పించి పెళ్లి చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఓ వెబ్సైట్ ద్వారా తనలాగే ఉండే బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మంజునాథ్ ను, బిపిన్ రాయ్ అలియాస్ మైఖేల్ ను కలుస్తాడు. ఆ తరువాత వీరు ముగ్గురు గోవాలో కలుసుకొని బాగా క్లోజ్ అవుతారు. అయితే వీరు కలవడానికి ముందు బిపిన్ రాయ్ హైదరాబాద్లో ఎస్ఐఏ అధికారిని దారుణంగా హత్య చేస్తాడు. ఆ మర్డర్ కేసు నుంచి తప్పించుకోవడానికే సిద్దార్థికి మైఖేల్గా పరిచయం అవుతాడు. ఆ కేసులో తనకు బదులుగా సిద్ధార్ద్ ని అరెస్ట్ చేయించాలని ప్లాన్ చేస్తాడు. మరి మైఖేల్ సిద్ధార్ద్ ని తన ప్లాన్ ప్రకారం ఇరికించగలిగాడా? తరవాత ఏం జరిగింది? అన్న అంశాలపై మిగతా కథ నడుస్తుంది.

ఎలా ఉంది అంటే:
కళ్యాణ్ రామ్ 3 పాత్రలలో నటించడం ఇదే తొలిసారి అయినప్పటికీ మూడిటిలికీ వేరియేషన్ చూపిస్తూ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఆషికా రంగనాథ్ పాత్ర నిడివి చాలా తక్కువే అయినప్పటికీ ఉన్నంత మేరకు మెప్పించింది. బ్రహ్మాజీ, సప్తగిరి ఎప్పటిలాగే తమ తమ పాత్రలో ఓదిగి పోయారు.
ఇక సినిమా విషయానికి వస్తే దర్శకుడు రాజేంద్ర రెడ్డి తీసుకున్న కాన్సెప్ట్ కొత్తది అయినప్పటికీ దాన్ని సినిమాలో చూపించడంలో ఆయన విఫలమయ్యారు. ప్రేమ కథ కూడా పాత చింతకాయి పచ్చడిలా చాలా రొటీన్ గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో పాత్రల పరిచయానికి ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల సినిమా సాగతీస్తునట్టు అనిపిస్తుంది. దాంతో పాటు ఫస్ట్ హాఫ్ లో అంతగా ట్విస్ట్స్ ఏమీ లేక పోవడంతో రొటీన్ గా అనిపిస్తుంది. “ఎన్నోరాత్రులు వస్తాయి కానీ..” పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ద్వితీయార్ధంలో వచ్చే యాక్షన్ సన్నివేసాలు కూడా ఆకట్టుకుంటాయి. మొత్తం మీద ఈ సినిమా ఏదో కొత్తగా చెప్పాలని ప్రయత్నించి సో సో సినిమాగా మిగిలిపోతుంది.

బలాలు:
‌కాన్సెప్ట్
‌కళ్యాణ్ నటన
‌ద్వితీయార్థం

బలహీనతలు:
‌కథనం
‌ప్రథమార్థం
‌అక్కడక్కడ సాగ తీసినట్టు ఉండే సన్నివేశాలు

What do you think?

1392 పోస్టులను భర్తీ చేయనున్న టీఎస్పీఎస్సీ(tspsc).

“ఆర్ఆర్ఆర్ ఒక అద్బుతం” ‌- స్టీఫెన్ స్పీల్బర్గ్.