in ,

ఆస్కార్కు ప్రాతినిధ్యం వహించిన తొలి తెలుగు సినిమా!

ఆస్కార్కు ప్రాతినిధ్యం వహించిన తొలి తెలుగు సినిమా!

తెలుగు సినిమాలు పాన్-ఇండియా సినిమాలుగా తెరకెక్కి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకుని అందరి ఆదరణ పొందుతున్నాయి. ఇటీవల రాజమౌళి తీసిన ‘ఆర్ఆర్ఆర్’ మన తెలుగు సినిమాల స్థాయిని మరింత పెంచేసింది. కానీ తెలుగు సినిమాల గురించి ఇండియాకే తెలియని కాలంలో ఒక ప్రముఖ తెలుగు సినిమా ప్రపంచ స్థాయిలో ఆదరణ పొంది చరిత్ర సృష్టించింది. ఆ సినిమానే ‘స్వాతిముత్యం’.

విలక్షణ నటుడు కమల్ హాసన్ తన నటనతో ప్రేక్షకులను ఆశ్చర్యపోయెలా చేసి యెనలేని అభిమానాన్ని పొందేలా చేసిన సినిమా స్వాతిముత్యం. 1986లో కె.విశ్వనాథ్ గారు ఈ సినిమాను తెరకెక్కించగా,నటి రాధికా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది.

విడుదలైన కొద్ది కాలంలోనే ప్రేక్షకుల మనసులకు చేరువైన ఈ సినిమా ఆ తరువాతి కాలంలో మూడు నంది అవార్డులు గెలుచుకోవడంతో పాటు మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకుంది..ఈ సినిమా ఆదరణ చూసిన పక్క రాష్ట్రల వారు ఎలాగైనా ఈ సినిమాను తమ ప్రేక్షకుల ముందుకు తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో తమిళంలో సిప్పిక్కుల్ ముత్తూ, కన్నడలో స్వాతి ముత్తూ మరియు హిందీలో ఈశ్వర్ పేర్లతో తెరకెక్కించి భారీ విజయాన్ని అందుకున్నారు.

ఇలా తెరకెక్కిన ప్రతి చోటా అబ్బురపరుస్తూ సాగిన ఈ సినిమా చివరిగా 1986లో
ఆస్కార్ అంటే తెలియని సమయంలోనే భారత దేశం తరుపున ఆస్కార్కు ప్రాతినిధ్యం వహించి చరిత్ర సృష్టించింది.ఇందువల్లనే ఇప్పటికీ ఈ సినిమాపై ప్రేక్షకులలో అంతులేని ఇష్టం,అభిమానం కనపడుతుంటుంది.

What do you think?

ఇది ప్రాణం తీసిన ఒక ప్రాంక్ కథ…

టికెట్ తీసుకోమంటే బిడ్డను వదిలేసి వెళ్లిపోయిన జంట.