in

టికెట్ తీసుకోమంటే బిడ్డను వదిలేసి వెళ్లిపోయిన జంట.

టికెట్ తీసుకోమంటే బిడ్డను వదిలేసి వెళ్లిపోయిన జంట.

 

ఒక జంట ఎయిర్ పోర్టుకు ఆలస్యంగా వచ్చారు. అయితే అక్కడ సిబ్బంది ఫ్లైట్ ఎక్కాలంటే చంటి బిడ్డకు కూడా టికెట్ తీసుకోవాలని చెప్పడంతో, బిడ్డను విమానాశ్రయంలోనే వదిలేసి విమానం ఎక్కడానికి పరుగులు తీశారు. ఈ వింత సంఘటన ఇజ్రాయెల్ (israel) లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే బెల్జియం వెళ్లేందుకు ఒక జంట స్ట్రోలర్ లో ఒక చంటి బిడ్డతో ఇజ్రాయెల్ బెన్ గురింయన్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ టికెట్ కౌంటర్ దగ్గర బిడ్డకు కూడా టికెట్ తీసుకోవాలని, లేకపోతే లోపలికి అనుమతించలేమని సిబ్బంది చెప్పారు.

దీంతో వాళ్ళు టికెట్ తీసుకోలేదు కదా.. అప్పటికే ఆలస్యంగా విమానాశ్రయానికి చేరుకున్న ఆ జంట స్ట్రోలర్లో ఉన్న బిడ్డను అక్కడే బోర్డింగ్ పాయింట్ దగ్గర వదిలేసి ఫ్లైట్ ఎక్కడానికి పరుగులు తీశారు. ఈ విషయం గమనించిన అధికారులు వెంటనే అప్రమత్తం అయ్యి భద్రతా సిబ్బందికి సమాచారాన్ని తెలియచేయగా, వాళ్ళు ఆ జంటను వెనక్కు తీసుకు వచ్చి ఆ చిన్నారిని వారికి అప్పగించారు.

ఈ విడ్డూరమైన ప్రవర్తనను చూసిన సిబ్బంది స్పందించారు. ఇలాంటి ప్రవర్తనను ఇంత ఇంతకు ముందెప్పుడూ చూడలేదని, వాళ్ళ కళ్లను వాళ్ళే నమ్మలేకపోయారని వాళ్ళు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
” విమానాశ్రయానికి ఆలస్యంగా చేరుకున్న ఆ జంట విమానం ఎక్కడ మిస్ అవుతుందోనన్న తొందరలో ఉన్నారు. ఆ కంగారులో తమ బిడ్డనే మర్చిపోతున్నామనే విషయాన్ని వారు గుర్తించలేకపోయుండొచ్చు ” అంటూ మరో అధికారి వెల్లడించారు.
అయితే ప్రస్తుతం ఈ వీడియో మాత్రం నెట్టింట వైరల్ గా మారింది.

What do you think?

ఆస్కార్కు ప్రాతినిధ్యం వహించిన తొలి తెలుగు సినిమా!

మానసిక ప్రశాంత ఆవశ్యకతపై క్రిస్టియానో రోనాల్డో..