in

ఇది ప్రాణం తీసిన ఒక ప్రాంక్ కథ…

ఇది ప్రాణం తీసిన ఒక ప్రాంక్ కథ…

చిన్న చిన్న సరధాలే మనుషుల ప్రాణాలు పోవడానికి కారణమవుతాయి. ఒక క్షణం నవ్వుతూ ఉన్నవాళ్లు మరో క్షణంలో ప్రాణాలు కోల్పోతారు. అలా సరదా కోసం చేసిన ప్రాంక్ ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.

బ్రెజిల్కు చెందిన 24 ఏళ్ల డానియల్ కోరియా అనే ఫుట్ బాల్ ఆటగాడు తన స్నేహితురాలైన ఆలన్ బ్రైట్స్ పుట్టిన రోజు సందర్భంగా జరుపుకుంటున్న పార్టీకి వెళ్ళాడు. పార్టీ ముగిసిన తరువాత డానియల్ కోరియాతో పాటు మరికొందరు ఆ రాత్రి అక్కడే ఉండాలనుకున్నారు. అయితే అందరూ పొడుకున్న తరువాత డానియల్ నిశబ్ధంగా వెళ్ళి బెడ్ పైన పొడుకుని ఉన్న అలన్ బ్రైట్స్ వాళ్ళ అమ్మ క్రిస్టియానా బ్రైట్ట్స్ పక్కన పొడుకుని తన ఫోన్లో ఫోటోలు తీసి వాట్స్ యాప్లో ఫ్రెండ్స్ కు పంపాడు. అదే సమయంలో వాళ్ళని చూసిన క్రిస్టియానా భర్త ఎడిసన్ బ్రైట్స్ తప్పుగా అర్థం చేసుకోవడంతో డానియల్ను మరొక ఇద్దరితో కలిసి చావకొట్టి కార్లో అక్కడ్నుంచి దూరంగా తీసుకువెళ్ళాడు.

ఆపై ముగ్గురు కలిసి డానియల్ పురుషాంగాన్ని తొలగించి గొంతు కోసి అతి గోరమైన విధంగా చంపేశారు. ఆ తరువాత రోజు అటుగా వెళ్తున్న వారు డానియల్ శరీరాన్ని చూసి పోలీసులకు తెలియచేశారు.

హత్య జరిగిన మూడు రోజుల తరువాత ఎడిసన్ బ్రైట్స్ డానియల్ను చంపానని తనంతట తాను పోలీసుల వద్దకు వచ్చి లొంగిపోయాడు.ఎడిసన్ పోలీసులతో సంఘటనను వివరిస్తూ డానియల్ క్రిస్టియానాపై అత్యాచారానికి యత్నించాడనుకున్నాని అందువల్లే అలా చేయల్సివచ్చిందని అయినప్పటికీ డానియల్ను చంపాలన్నది వారి ఉద్దేసం కాదని కేవలం తన బట్టలు విప్పి రోడ్డుపై వదిలేయాలనుకున్నామన్నాడు. ఈ సంఘటన పై అలన్ బ్రైట్స్ మాట్లాడుతూ డానియల్ వచ్చినప్పటి నుంచి చెడుగా ప్రవర్తిస్తున్నాడని చెప్పారు.పూర్తిగా విచారించిన పోలీసులు ఆ రోజు డానియల్ తాగిన మత్తులో ఉన్నాడని క్రిస్టియానాతో ఫోటోలు తీసుకోవడం తప్ప ఇంకేమీ చేయలేదని వెల్లడించారు. ఆ తరువాత ఎడిసన్ను తనకు సహాయపడిన మరో ఇద్దరినీ మరియు అలన్ను, క్రిస్టియానాను అదుపులోకి తీసుకున్నారు.ఏదేమైనా సరదాకోసం చేసిన ఒక చిన్న పని నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.

What do you think?

కోట్ల రూపాయల బిట్కాయిన్ను పిజ్జా కోసం అమ్మిన గనుడు

ఆస్కార్కు ప్రాతినిధ్యం వహించిన తొలి తెలుగు సినిమా!