in ,

సమంత ఆ యంగ్ హీరో తో కలిసి నటించబోతోందట..!

సమంత ఆ యంగ్ హీరోతో కలిసి నటించబోతోందట..!

సమంత మైయోసిటిస్ నుంచి కొల్కొనప్పటి నుండి వేగం పెంచింది. ఇటీవల విడుదలైన “శాకుంతలం” ఆశించిన ఫలితం ఇవ్వక పోయినప్పటికీ సమంత సినిమాలను ఎంచుకుని పూర్తి చేయడంలో ఏ మాత్రం తగ్గడం లేదు.

ప్రస్తుతం విజయ దేవర కొండ “ఖుషి” సినిమాలో నటిస్తున్న సమంత, మరో వైపు “ఫ్యామిలీ మ్యాన్”, “ఫర్జి” వంటి వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులలో మంచి పేరు తెచ్చుకున్న రాజ్ అండ్ డీకే లు తెరకెక్కిస్తున్న “సిటడెల్” సిరీస్ లో కూడా ప్రథాన పాత్రలో నటిస్తుంది.

అయితే ఇప్పుడు తాజాగా ఆమె మరో యంగ్ హీరో సినిమాలో నటించడానికి సైన్ చేసినట్టుగా తెలుస్తుంది.

“డీజే టిల్లు” సినిమాతో ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న సిద్దూ జొన్నలగడ్డతో సమంత త్వరలో నటించబోతోందట.

ప్రస్తుతం సిద్దూ జొన్నలగడ్డ డీజే టిల్లు సీక్వెల్ తో బిజీగా ఉండగా.. ఈ సినిమా తరువాత ఆయన ప్రొడ్యూసర్ రామ్ తళ్లూరి నిర్మించబోతున్న సినిమాలో సిద్దూ నటించబోతున్నాడట. ఈ సినిమాలోనే సమంత హీరోయిన్ గ నటించబోతోందట. ఇక ఈ సినిమాకి “ఓ బేబీ”, “అన్నీ మంచి శకునములే” సినిమాలతో పర్లేదనిపించుకున్న నందినీ రెడ్డి దర్శకత్వం వహించబోతున్నారట.

What do you think?

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం!

ట్విట్టర్ కు దీటుగా మెటా కొత్త యాప్! జూన్లో లాంచ్?