in

ట్విట్టర్ కు దీటుగా మెటా కొత్త యాప్! జూన్లో లాంచ్?

ట్విట్టర్ కు దీటుగా మెటా కొత్త యాప్! జూన్లో లాంచ్?

 

ట్విట్టర్ కు దీటుగా మెటా ఓ సరి కొత్త యాప్ ను తీసుకు రాబోతోంది. ఈ యాప్ లో కూడా ట్విట్టర్ లో ట్వీట్ చేసినట్టుగా మెసేజ్లను పోస్ట్ చేయవచ్చని తెలుస్తుంది.

 

ఈ మెటా యాప్ ఇన్స్టా (insta) ను పోలి ఉంటుందని సమాచారం. అయితే ఈ యాప్ లో ఫోటోలు, వీడియో బదులుగా టెక్స్ట్ ఆధారిత టైమ్ లైన్ పోస్ట్ లు కనిపించనున్నాయి. ఈ పోస్ట్ లు టెక్స్ట్ లు 500 అక్షరాలతో ఉండబోతున్నాయని తెలుస్తోంది. అంటే ఈ యాప్ చాలా వరకు ట్విట్టర్ ను పోలి ఉండబోతోందనమాట. ఈ టెక్స్ట్ పోస్టులకు కూడా యూజర్లు ఫోటోలను, వీడియోలను అటాచ్ చేయొచ్చట. అదే విధంగా ఇన్స్టా లో, ట్విట్టర్ లో ఫాలో చేసినట్టుగానే ఈ యాప్ లో కూడా యూజర్లు ఎవరినైనా ఫాలో కూడా చేయొచ్చట.

 

ఇక ఈ యాప్ ఈ ఏడాది జూన్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుండగా.. ఇప్పటికే ఈ యాప్ ను పరిశీలించడానికి, ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో తెలుసుకోడానికి కొంత మంది ఇన్ఫ్లుయెన్సర్ తో ఈ యాప్ మెటా యూజ్ చేయిస్తుంది.

దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా నెట్టింట చెక్కర్లు కొడుతున్నాయి.

What do you think?

సమంత ఆ యంగ్ హీరో తో కలిసి నటించబోతోందట..!

చిన్నారి కంటి నుంచి ఇనుము, పేపర్ ముక్కల వ్యర్ధాలు!