in

చిన్నారి కంటి నుంచి ఇనుము, పేపర్ ముక్కల వ్యర్ధాలు!

చిన్నారి కంటి నుంచి ఇనుము, పేపర్ ముక్కల వ్యర్ధాలు!

 

బియ్యపు గింజలు, ఇనుము, పేపర్ ముక్కలు ఇలా వ్యర్ధాలు ఓ చిన్నారి కంటిలో నుంచి బయట పడుతున్నాయి. పాపకి ఎందుకు ఇలా అవుతుందో తెలియని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇది తెలిసిన చుట్టు పక్కల వారు అవాక్కవతున్నారు.

 

వివరాల్లోకి వెళ్తే ఎనిమిదేళ్ళ సౌజన్య అనే చిన్నారి చిన్నపాటి నుండి అమ్మమ్మ ఊరు గార్లమండల పెద్దకృష్ణాపురంలో ఉంటూ చదువుకుంటుంది. చిన్నప్పటి నుండి చిన్నారి బాగానే ఉంది. అయితే మూడు నెలల క్రితం సౌజన్య కంటి నుంచి ఓ పత్తి గింజ బయటపడింది. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు తనని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకు వెళ్లి చికిత్స ఇప్పించారు. ఆ తరువాత తనకు నయం అయిపోయింది.

ఐతే ఇక అంత బాగుందనుకుంటున్న తరుణంలో మళ్ళీ కొన్ని రోజులు కిందటి నుంచి సౌజన్య కంటి నుండి బియ్యం, ఇనుము, పేపర్ ముక్కలు ఇలా వ్యర్ధాలు రావడం మొదలైంది. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కంటి నుంచి వ్యర్ధాలు వస్తున్న విషయం తెలిసిన స్థానికులు అవాక్కవుతున్నారు.

మరో పక్కన పాపకు ఇలా ఎందుకు అవుతుందో తెలియని డాక్టర్లు సమాధానం తెలుసుకోవడం కోసం తిప్పలు పడుతున్నారు.

What do you think?

ట్విట్టర్ కు దీటుగా మెటా కొత్త యాప్! జూన్లో లాంచ్?

మెడికో ప్రీతి సోదరికి హెచ్ఎండీఏలో ఉద్యోగం!