in

మెడికో ప్రీతి సోదరికి హెచ్ఎండీఏలో ఉద్యోగం!

మెడికో ప్రీతి సోదరికి హెచ్ఎండీఏలో ఉద్యోగం!

 

సీనియర్ వేదింపులు తట్టుకోలేక పాయిజన్ ఇంజెక్షన్ తో ఆత్మ హత్యకు పాల్పడి ప్రాణాలు తీసుకున్న మెడికో గురించి అందరికి తెలిసిన విషయమే. ఈ ఘటనలో నిందితుడుకి శిక్ష పడేలా చేస్తామని, ప్రీతి కుటుంబానికి అండగా ఉంటామని తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీల గురించి కూడా అందరికీ తెలిసినవే. అయితే ఈ హామీలను నిలబెట్టుకుంటూ తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రీతి సోదరికి ఉద్యోగం ఇప్పించింది.

 

ఆత్మ హత్యకు పాల్పడి ప్రాణాలు వదిలిన డాక్టర్ ధరావత్ ప్రీతి నాయక్ సోదరి పూజకు హెచ్ఎండీఏ (హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ)లో సపోర్ట్ అసోసియేట్గా ఉద్యోగం ఇస్తూ హెచ్ఎండీఏ ఉత్తర్వులు జారీ చేసింది. పూజకు ఐటీ సెల్లో కాంట్రాక్ట్ బేసిస్ లో ఈ ఉద్యోగం ఇచ్చినట్టు ఉత్వర్వుల్లో హెచ్ఎండీఏ పేర్కొంది.

 

ఈ సందర్భంగా.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం తరపున ఇచ్చిన మాట నిలుపుకున్నామని, ప్రభుత్వం ఆమె కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని నాడు చెప్పింది, నేడు అది చేసి చూపించిందని అన్నారు .

ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన పరిహారంతో పాటు పార్టీ తరపున సేకరించిన విరాళాలను కలిపి ప్రీతి కుటుంబానికి అందించామని దయాకర్ పేర్కొన్నారు.
అదే సమయంలో తమ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించమని వాళ్లు కోరిన దాన్ని కూడా మంత్రి కేటీఆర్ గారు సానుకూలంగా స్పందించి తన పరిధిలోని హెచ్ఎండీఏలో ప్రీతి సోదరికి ఉద్యోగం ఇప్పించారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  తెలిపారు.

What do you think?

చిన్నారి కంటి నుంచి ఇనుము, పేపర్ ముక్కల వ్యర్ధాలు!

ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు రాజ్ కన్నుమూత!