in

సూర్యుడిపై ప్రయోగానికి సిద్దం అవుతోన్న ఇస్రో. సెప్టెంబరు 2న..

సూర్యుడిపై ప్రయోగానికి సిద్దం అవుతోన్న ఇస్రో. సెప్టెంబరు 2న..

చంద్రయాన్‌ 3 ఘన విజయం తరువాత ఇస్రో సూర్యుడిపై ప్రయోగం చేయడానికి సిద్ధం అవుతోంది. దీనికి సంబంధించిన తేదీని కూడా ఇటీవల ఇస్రో అధికారి ప్రకటించారు.

ఇస్రో సూర్యుడి పై ప్రయోగాలు చేసేందుకు సెప్టెంబరు 2 వ తేదీన ఆదిత్య ఎల్‌ 1 ప్రయోగాన్ని చేపట్టనున్నట్లు ఇస్రో అధికారి ఒకరు వెల్లడించారు. సెప్టెంబరు 2వ తేదీన ఈ ఆదిత్య ఎల్ 1 ప్రయోగాన్ని నింగిలోకి పంపనున్నారని, ఆ ఉపగ్రహాన్ని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌కు తరలించారని ఆయన తెలిపారు. వాహకనౌక పీఎస్‌ఎల్‌వీ-సి 57.. ఆదిత్య ఎల్‌ 1 ఉపగ్రహాన్ని మోసుకుని అంతరిక్షంలోకి దూసుకెళ్లనుందని పేర్కొన్నారు.

సూర్యుడిపై ఉండే వాతావరణాన్ని పూర్తిగా పరిశోధించాలన్న లక్ష్యంతోనే ఈ ప్రాజెక్టును చేపట్టారని తెలిపారు. కరోనాగ్రఫీ పరికరం సాయంతో సూర్యుడిపై ఈ పరిశోధనలు చేయనుందని.. ఆస్ట్రేలియా, యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ, ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సాయంతో ఇస్రో ఈ ప్రయోగం చేయనుందని వివరించారు.

What do you think?

నితీష్‌ తివారి రామాయణంలో సీతగా సాయి పల్లవి?

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పాఠశాలల్లో మొబైల్ ఫోన్లు నిషేధం.