in

వ్యాపారం అభివృద్ధి చెందాలా? అయితే ఇది చదవండి

వ్యాపారం అభివృద్ధి చెందాలా? అయితే ఇది చదవండి

 

ప్రపంచం మొత్తంలో దాదాపు 100 కోట్ల మంది వ్యాపార వేత్తలు రకరకాల వ్యాపారాలు నడుపుతున్నారు. వాటిలో వార్షిక టర్నోవర్ లేదా ఆదాయం 5 కోట్ల లోపు ఉన్న చిన్న బిజినెస్లే ఎక్కువ. అయితే 50 శాతం వ్యాపారాలు మొదలైన కొన్ని సంవత్సరాలకే ముగిసిపోతున్నాయని చారిత్రక గణాంకాలు చెబుతున్నాయి.

మన భారత దేశంలో సుమారు 6 కోట్ల సూక్ష్మ మరియు చిన్న వ్యాపారాలు ఉంటే వాటిలో చిన్న వ్యాపారాలు కోటి మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. మిగిలిన సూక్ష్మ వ్యాపారాలు కేవలం ఒక మనిషి శ్రమతో, అతను వెచ్చించే డబ్బుతోనే నడుస్తున్నాయి.
మరో పక్క చాలా మంది వ్యాపార వేత్తలు వాళ్ళ డబ్బును, శ్రమను, సమయాన్ని వెచ్చించి ఆ వ్యాపారాన్ని ప్రజలలోకి తీసుకు వెళ్లడానికే పరయత్నిస్తుంటారు. కానీ వాళ్ళు అనుకున్న విధంగా అవి విజయం సాధించవు.

ఒకరు వ్యాపారం మొదలు పెట్టడానికి అనేక కారణాలు ఉంటాయి.

1.తమ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కొందరు వ్యాపారాలను మొదలు పెడుతుంటారు.

2.సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభిస్తే తమకు తామే స్వతహాగా పని చేసుకోవచ్చు అనే కారణం మీద కూడా కొంత మంది వ్యాపారాలలోకి దిగుతుంటారు.

3.చేస్తున్న ఉద్యోగంపై అయిష్టంతో..

కొందరు ఉద్యోగాలలో చేరితే వత్తిడి ఎక్కువ ఉంటుందని వారానికి 45 గంటలు పని చేయడం ఇష్టం లేక వ్యాపారాలలోకి దిగుతారు.

ఇంకొందరు వారికి వచ్చే జీతం చాలా తక్కువని.. వారి నైపుణ్యానికి బయట డిమాండ్ ఎక్కువ ఉందని.. వాళ్ళు స్వతహాగా కష్టపడితే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయనే భావనతో వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటారు.

4.నచ్చింది చేయడానికి

తమకు ఉన్న నైపుణ్యం ఇంకెవరికి లేదని.. ఈ ప్రపంచానికి అది అవసరమని.. దానితో సులువుగా డబ్బును సంపాదించవచ్చు అన్న అపోహలలో బ్రతుకుతూ మరికొందరు వ్యాపారంలోకి దిగుతుంటారు.

ఒక వ్యాపారం కూలిపోవడానికి కూడా చాలా కారణాలు ఉంటాయి.

ఒక ఉత్పత్తికి కావాల్సిన సరైన వినియోగదారుడుని పట్టుకోలేక పోవడం. చాలా వ్యాపారాలు దీని వల్లే చతికిల పడిపోతాయి. కానీ ఈ ప్రపంచంలో తయారయ్యే ప్రతి ఉత్పత్తి ఎవరో ఒకరికి కావాల్సిందే.. ఉదాహరణకి అందరూ ఒకే రకమైన సేవలను అందిస్తే అప్పుడు ఆ వ్యాపారం కార్యరూపం దాల్చుతుంది. కాబట్టి మీ ఉత్పత్తికి లేదా సేవకి కావాల్సిన వినియోగదారులు దొరికే వరకు వెతకాలి. లేకపోతే వ్యాపారం కొనసాగడం కష్టం అవుతుంది.

తక్కువ నగదు ప్రవాహం

పనిని మొదలు పెట్టే ముందు ఏడాదికి అవసరమయ్యే మూలధనం ఉండేలా చూసుకోకపోవడం, డబ్బు అనుకోని విధంగా కరిగిపోవడం వ్యాపారం అభివృద్ది కాకపోవడానికి ఓ కారణం.

అడ్వర్టైజింగ్ (ప్రకటనలు),మార్కెటింగ్

మార్కెటింగ్ సరిగ్గా చేయకపోవడం కూడా చాలా వరకు వ్యాపారం అభివృద్ధి చెందక పోవడానికి కారణం అవుతుంది.

పోటీని సరిగ్గా అంచనా వేయలేకపోవడం

కొత్త ఉత్పత్తులపై, సేవలపై అవసరమైన పరిశోధన చేయకపోవడం, సాంకేతిక రంగంలో పోటీ ఎక్కువ ఉండడమే చాలా వరకు స్టార్ట్-అప్స్ లాభాలను పొందలేకపోవడానికి కారణమని చెప్పొచ్చు.

మరి వ్యాపారం అభివృద్ది చెందాలంటే..

ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 30 ఏళ్ల వ్యక్తి ప్రారంభించే వ్యాపారం కన్నా 50 ఏళ్ల వ్యక్తి ప్రారంభించే వ్యాపారమే విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ 50 ఏళ్ల వ్యక్తి తన జీవిత ప్రయాణంలో ఎన్నో వడిదొడుకులను ఎదుర్కుని ఉంటారు. ఎన్నో విషయాలలో అనుభవం పొంది ఉంటారు.

అలా అని అనుభవం లేకపోతే అసాధ్యం అని చెప్పలేము. ఎందుకంటే 5 సంవత్సరాలకు పైగా నిలిచి బట్టకట్టిన వ్యాపారాలు కూడా ఫౌండర్ కి అంతగా అనుభవం లేనప్పటికీ వాటి ప్రయాణంలో జరిగిన తప్పులను సరిదిద్దుకుని, వేగంగా ముందుకు తీసుకు వెళ్ళినవారు ఉన్నారు. అయితే అలాంటి సంస్థల అభివృద్ధిలో కన్సల్టెంట్లు ప్రధాన పాత్ర పోషిస్తారు.

ఎందుకంటే ఒక వ్యాపారాన్ని అభివృధి పరచడానికి కన్సల్టెంట్లు నియమించుకోవడం చాలా ముఖ్యం. వాళ్ళు ఒకరితో ఒకరు సంబాషించుకొని క్లయింట్లను కలసి నిత్యం పని జరిగేలా చూస్తూ గడువులోపల ఆ పనిని పూర్తయ్యేల చూస్తే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అయితే కన్సల్టెంట్స్ అంటే కశ్చితంగా ఉద్యోగి అయ్యి ఉండాల్సిన అవసరం లేదు. మనకు తెలిసిన వాళ్ళు, ఇంట్లో అనుభవం కలిగిన వాళ్ళు ఎవరినైనా ఈ పనికోసం ఎంచుకోవచ్చు.

పనిని పంచుకోవాలి

నైపుణ్యం,అనుభవం ఉన్న వారిని ఒక చోట చేర్చి వారికి పనులను కేటాయిస్తే దాని ఫౌండర్ తన సంస్థ నైపుణ్యాన్ని పెంచుకోవచ్చు,అభివృద్ధి వైపుగా అడుగులు వేయొచ్చు.

కొన్ని పనులను, బాధ్యతలను ఒకే వ్యక్తి చేయవచ్చు, కానీ మంచి ఆలోచనలు, కొత్త ఆలోచనలు, మెరుగైన పారదర్శకత, మంచి సమ్మతి కోసం వేరే వారి సహాయం తీసుకోవడం తెలివైన పని. కాబట్టి పని పంచుకుంటే వ్యాపార అభివృద్ధికి చాలా దోహద పడుతుంది.

మార్కెటింగ్ ప్రధాన పాత్ర పోషిస్తుంది

విజయవంతంగా సాగే వ్యాపారాలకు సోషల్ మీడియా ద్వారా ప్రమోషన్స్ చేయడం, అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం కూడా వ్యాపారానికి సహాయ పడతాయి. పబ్లిక్ రిలేషన్స్ కూడా మార్కెటింగ్ లో సహాయ పడుతూ వ్యాపారాన్ని అభివృద్ది పరుస్తాయి.

డబ్బు ప్రాధాన్యత

ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టినప్పుడు అది వెంటనే 100 శాతం విజయం సాధిస్తుందని చెప్పడం కష్టం. కాబట్టి వ్యాపారాన్ని మొదలు పెట్టినప్పటి నుండి ఏడాది ఒకరు ఎటువంటి ఇబ్బందులు వచ్చిన మనీ ఫ్లో కు ఇబ్బంది కలగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక రూపాయి వెచ్చించే ముందు ఆ రూపాయి ఎటువైపు వెళ్తుందో, దేనికి కోసం వెచ్చిస్తున్నామో వ్యాపారికి ఒక అవగాహన ఉండాలి.

చివరిగా ఒక వ్యాపారం విజయం పొంది, అభివృద్ది చెందాలంటే సరైన విధంగా డబ్బును వెచ్చిస్తూ, సలహాదారులతో అవసరమైనప్పుడు సరైన నిర్ణయాలు తీసుకుంటూ జాగ్రత్తగా వ్యాపారాన్ని నడిపితే తక్కువ అనుభవంతోనే వ్యాపారాన్ని అభివృద్ది పరచవచ్చు.

What do you think?

చిరుతతో పోరాడి అధికారులకు అప్పగించాడు!

రాజకీయాల్లోకి అడుగు పెట్టనున్న అభిషేక్ బచ్చన్