in ,

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో 37వ స్థానంలో రహానే!

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో 37వ స్థానంలో రహానే!

 

అజింక్య రహానే దూసుకొచ్చాడు. డబ్ల్యూటీసీ (WTC) ఫైనల్లో ఆటతో అదరగొట్టిన రహానే టెస్ట్ ర్యాంకింగ్స్‌లో 37వ స్థానంలో నిలిచాడు.

తాజాగా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్ లో టాప్‌టెన్ లో మూడు స్థానాలు ఆసీస్ ప్లేయర్లు చేజిక్కించుకున్నారు. లబూచానే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్‌లు తొలి మూడు స్థానాల్లో నిలిచారు. అయితే ఈ టాప్ టెన్‌లో మన భారత్ నుంచి రిషభ్ పంత్ (10) మాత్రమే ఉండగా.. డబ్ల్యూటీసీ (WTC) ఫైనల్లో ఆటతో అదరగొట్టిన అజింక్య రహానే టెస్ట్ ర్యాంకింగ్స్‌లో 37వ స్థానంలోకి దూసుకువచ్చాడు. ఇక బౌలర్ల విభాగంలో రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. బుమ్రా ఎనిమిది, జడేజా తొమ్మిదో స్థానంలో నిలిచారు.

What do you think?

గాలి జనార్ధన్ కు షాక్ ఇచ్చిన సీబీఐ స్పెషల్ కోర్ట్

ముగిసిన వైసీపీ ఎంపీ భార్యా,కుమారుడి కిడ్నాప్ డ్రామా